నంబర్‌ప్లేట్లపై ‘‘వంకర’’ వేషాలొద్దు: వాహనదారులకు ట్రాఫిక్ సీపీ వార్నింగ్

By Siva KodatiFirst Published Apr 5, 2019, 10:51 AM IST
Highlights

మనోళ్లకి ప్రతి దానిలో ఫ్యాషన్ కావాలి. బైక్ నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలతో ఉంటాయి. అది కూడా వంకర టింకరగా, పై నెంబర్ ఓ కలర్‌లో ఉంటే.. కింది నెంబర్లు మరో కలర్‌లో మెరుస్తూ ఉంటాయి

మనోళ్లకి ప్రతి దానిలో ఫ్యాషన్ కావాలి. బైక్ నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలతో ఉంటాయి. అది కూడా వంకర టింకరగా, పై నెంబర్ ఓ కలర్‌లో ఉంటే.. కింది నెంబర్లు మరో కలర్‌లో మెరుస్తూ ఉంటాయి.

అయితే మోటారు వాహనాల చట్టం ప్రకారం ఈ విధమైన నెంబర్ ప్లేట్లు ఉండటం నేరం. ఈ క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీటిపై ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు.

నగర ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ గట్టి ఫోకస్ పెట్టారు. గురువారం మీడియాతో సమావేశంలో మాట్లాడిన ఆయన నేరాలు చేయడానికి వాహనాలు వాడే వారు సైతం సక్రమంగా లేని నంబర్ ప్లేట్లు వినియోగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు సీపీ తెలిపారు.

ఈ అంశాలతో పాటు నంబర్‌ప్లేట్‌పై ‘‘ పోలీస్, ప్రభుత్వ వాహనం, కార్పోరేటర్, ప్రెస్, ఆర్మీ, ఎమ్మెల్యే, ఎంపీ’’ ఇలా ఎలాంటి అక్షరాలు, అంశాలు రాయడం కూడా నిబంధనలకు విరుద్ధమన్నారు.

తప్పుడు నెంబర్‌ప్లేట్స్ కలిగి ఉండటం, వాటిలో అంకెలు అక్షరాల్లో మార్పులు చేయడం వంటి చర్యలకు ఉద్దేశపూర్వకంగా పాల్పడినట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

నంబర్‌ప్లేట్స్‌ విషయంలో పాటించాల్సిన నిబంధనలు:

* ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలతో నెంబర్ ప్లేట్ ఉండాలి.

* కమర్షియల్, గూడ్స్ వాహనాలకు పసుపు రంగు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి.

* నంబర్‌ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, సందేశాలు తదితరాలు నిషేధం.

*  ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్‌ ప్లేట్‌ 200 ఇంటూ 100 మిల్లీ మీటర్లు, తేలికపాటి వాహనాలు, ప్యాసింజర్‌ కార్లకు 340 ఇంటూ 200 మిల్లీ మీటర్లు లేదా 500 ఇంటూ 120 మిల్లీ మీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్‌ వాహనాలకు 340 ఇంటూ 200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి

click me!