హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం..

Published : Dec 03, 2022, 10:03 AM IST
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం..

సారాంశం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. ఓ ప్రొఫెసర్ కీచక పర్వం వెలుగుచూసింది. 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ కీచక పర్వం వెలుగుచూసింది. ప్రొఫెసర్ అత్యాచారం చేసేందుకు యత్నించాడని విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. థాయ్‌లాండ్‌ చెందిన బాధిత విద్యార్థిని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. విద్యార్థినిపై ప్రొఫెసర్ రవిరంజన్ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే అతడి బారి నుంచి తప్పించుకున్న విద్యార్థిని.. ఈ విషయంపై గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. ప్రొఫెసర్ రవిరంజన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విద్యార్థిని ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్