సీసీఎంబీ సైంటిస్ట్ డాక్టర్ మంజులా రెడ్డికి రూ.లక్ష డాలర్ల బహుమతి

Published : Nov 08, 2019, 11:19 AM IST
సీసీఎంబీ సైంటిస్ట్ డాక్టర్ మంజులా రెడ్డికి రూ.లక్ష డాలర్ల బహుమతి

సారాంశం

ఇన్ఫోసిస్ కంపెనీ ప్రతి సంవత్సరం జీవశాస్త్ర రంగంలో పరిశోధనలు చేసేవారికి అవార్డులను అందజేస్తోంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అవార్డులను ప్రధానం చేసింది. ఈ అ వార్డు గ్రహీతల్లో హైదరాబాద్ కి చెందిన డాక్టర్ మంజులా రెడ్డి కూడా ఉన్నారు. ఆమె కొత్త యాంటీ బయాటిక్ మందులను ఏవిధంగా కనిపెట్టగలమో, దానికి సంబంధించిన సులువైన మార్గాలను కనిపెట్టారు.

హైదరాబాద్ లోని సీసీఎంబీ( సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) ప్రిన్సిపల్, సైంటిస్ట్ డాక్టర్ మంజులా రెడ్డికి అరుదైన ఘతన దక్కింది. ఆమె చేసిన కృషిని ఇన్ఫోసిస్ సంస్థ గుర్తించింది. 

ఇన్ఫోసిస్ కంపెనీ ప్రతి సంవత్సరం జీవశాస్త్ర రంగంలో పరిశోధనలు చేసేవారికి అవార్డులను అందజేస్తోంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అవార్డులను ప్రధానం చేసింది. ఈ అ వార్డు గ్రహీతల్లో హైదరాబాద్ కి చెందిన డాక్టర్ మంజులా రెడ్డి కూడా ఉన్నారు. ఆమె కొత్త యాంటీ బయాటిక్ మందులను ఏవిధంగా కనిపెట్టగలమో, దానికి సంబంధించిన సులువైన మార్గాలను కనిపెట్టారు.

అంతేకాకుండా బ్యాక్టీరియా కణం యొక్క గోడల నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు వివిధ రకాల పరిశోధనలు చేశారు. బ్యాక్టీరియా సెల్ వాల్  నిర్మాణానికి సంబంధించి డాక్టర్ మంజులా రెడ్డి, ఆమె బృందం చేసిన ప్రయోగాలను అవార్డు కమిటీ గుర్తించింది. ఈ సందర్భంగా ఆమెను అవార్డు కమిటీ ప్రశంసించింది.

జీవ రసాయన, జన్యుశాస్త్రాల ఆధారంగా కొన్ని రకాల ఎంజైమ్ ల సాయంతో కణం గోడలు ఏవిధంగా రెండుగా విడిపోతున్నాయన్న విషయాలపై కూడా ఆమె పరిశోధనలు చేశారు. జీవశాస్త్రంతోపాటు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, గణిత, భౌతిక, సామాజిక శాస్త్రాల్లో కూడా పరిశోధనలు జరిపారు. అవార్డుతో పాటు ఆమెకు లక్ష డాలర్ల నగదు బహుమతి కూడా ఇచ్చారు. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.71లక్షలు. దీనితోపాటు గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం కూడా అందజేశారు.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే