మీర్ పేటలో భారీ పేలుడు.. మహిళకు తీవ్రగాయాలు

Published : Nov 08, 2019, 10:52 AM ISTUpdated : Nov 08, 2019, 11:09 AM IST
మీర్ పేటలో భారీ పేలుడు.. మహిళకు తీవ్రగాయాలు

సారాంశం

మహిళకు తీవ్ర గాయాలై.. రక్త స్రావం బాగా జరిగింది. కాగా... తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స  నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా... ఈ పేలుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

హైదరాబాద్ నగరంలోని మీర్ పేటలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో మహిళ అక్కడ చెత్త ఏరుకుంటోందని స్థానికులు చెబుతున్నారు. మహిళకు తీవ్ర గాయాలై.. రక్త స్రావం బాగా జరిగింది. కాగా... తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స  నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా... ఈ పేలుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పేలుడు దేని వల్ల సంభవించింది అన్న విషయం మాత్రం తెలియలేదు. స్థానికులు ఇప్పటికే పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు