టెక్కీ కుమారుడ్ని మింగేసిన ల్యాంప్ పోల్

By Nagaraju penumalaFirst Published Feb 12, 2019, 5:19 PM IST
Highlights

అలా ఆటలాడుకుంటూ దగ్గర్లో ఉన్న ల్యాంప్ పోల్ ను పట్టుకున్నారు. ల్యాంప్ పోల్ నుంచి ఒక్కసారిగా విద్యుత్ పాస్ అవ్వడంతో ఆ బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ల్యాంప్ పోల్ ను పట్టుకున్న వెంటనే విద్యుత్ షాక్ తగలడంతో ఆ పోల్ కు అతుక్కుపోయాడు. 
 

హైదరాబాద్: గండిపేటలోని ఓఅపార్ట్ మెంట్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలి తీసుకుంది. గండిపేటలోని పెబెల్ సిటీలో ఆడుకునేందుకు వెళ్లిన ఆరేళ్ల బాలుడు విద్యుత్ షాక్ తో దుర్మరణం చెందాడు. 

చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి పెబెల్ సిటీలో నివాసం ఉంటున్నారు. ఆ దంపతుల తనయుడు మూసిన్. మూసిన్ స్థానికంగా ఉంటున్న టైమ్స్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం మూసిన్ తన స్నేహితులతో కలిసి పెబెల్ సిటీ పార్క్ లో ఆడుకునేందుకు బయలు దేరాడు. 

అలా ఆటలాడుకుంటూ దగ్గర్లో ఉన్న ల్యాంప్ పోల్ ను పట్టుకున్నారు. ల్యాంప్ పోల్ నుంచి ఒక్కసారిగా విద్యుత్ పాస్ అవ్వడంతో ఆ బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ల్యాంప్ పోల్ ను పట్టుకున్న వెంటనే విద్యుత్ షాక్ తగలడంతో ఆ పోల్ కు అతుక్కుపోయాడు. 

అయితే ఆ విషయాన్ని తోటి చిన్నారులు కానీ స్థానికులు కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత మూసిన్ కింద పడిపోయాడు. కదలకపోవడంతో అనుమానం వచ్చిన చిన్నారులు పెద్దలకు తెలియజేయడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. 

పెబెల్ సిటీలో మెయింటెనెన్స్ సరిగ్గా లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మెయింట్ నెన్స్ చార్జీలు చెల్లిస్తున్నా మెయింటెనెన్స్ మాత్రం సక్రమంగా చెయ్యడం లేదన్నారు. గతంలో ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రజలు తెలిపారు. 

అయితే మెయింట్ నెన్స్ వ్యక్తి మాత్రం తనకు సంబంధం లేదని అసోషియేషన్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ పెబెల్ సిటీ యాజమాన్యం మాత్రం పార్క్ ను చూపించి లక్షలాది రూపాయలతో ప్లాట్స్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. 

వెబ్సైట్ లలో, ప్రకటనలలో అద్భుతం అంటూ ప్రకటనలు ఇస్తూ సొమ్ము చేసుకుని ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్నారని వాపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు  విచారణ చేపట్టారు.  

click me!