పోలీస్ వాహనంలో యువకుల హల్‌చల్: సీఐకు మెమో

Published : Jun 02, 2019, 12:20 PM ISTUpdated : Jun 02, 2019, 12:21 PM IST
పోలీస్ వాహనంలో యువకుల హల్‌చల్: సీఐకు మెమో

సారాంశం

పోలీసు పెట్రోలింగ్ వాహనంతో  రోడ్డుపై  యువకులు  హల్ చల్ చేసిన ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన సీఐపై పోలీసు ఉన్నతాధికారులు మోమో జారీ  చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. 

హైదరాబాద్: పోలీసు పెట్రోలింగ్ వాహనంతో  రోడ్డుపై  యువకులు  హల్ చల్ చేసిన ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన సీఐపై పోలీసు ఉన్నతాధికారులు మోమో జారీ  చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. 

శుక్రవారం రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో యువకులు  హల్ చల్ చేశారు. హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని ఓ సీఐ శనివారం నాడు సెలవులో ఉన్నాడు. అయితే సీఐ సెలవులో ఉన్నందున వాహనాన్ని కంట్రోల్ రూమ్‌లో అప్పగించాలి. ఈ వాహనం డ్రైవర్ తన ఇంటికి వాహనాన్ని తీసుకెళ్లాడు. తన కొడుకుకు వాహానాన్ని అప్పగించాడు.

వాహనాన్ని కంట్రోల్‌రూమ్‌లో అప్పగించి రావాలని  కొడుకుకు వాహానాన్ని ఇచ్చాడు. దీంతో ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి వాహనాన్ని  తీసుకెళ్లాడు. ఎల్బీనగర్ నుండి మలక్‌పేట వైపు వెళ్లే దారిలో ఈ వాహనంలో యువకుల ఆగడాలపై మీడియాలో వార్తలు వచ్చాయి.

దీంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. హైద్రాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ పరిధిలో పనిచేసే సీఐ ఉపయోగించే వాహనంగా గుర్తించారు.  ఈ వాహనాన్ని ఉపయోగించే సీఐకు పోలీసు ఉన్నతాధికారులు మోమో జారీ చేశారు. అంతేకాదు ఈ ఘటనపై పోలీసులు విచారణకు ఆదేశించారు.ఈ విచారణ రిపోర్ట్ ఆధారంగా  సీఐపై చర్యలు తీసుకొంటామని హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

KTR Pressmeet: తుగ్లక్ పరిపాలన చూస్తున్నాం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu
Home: మెట్రో దగ్గర ఇల్లు ఉంటే EMI భారం తగ్గుతుంది.. ఇదెక్కడి లాజిక్ అని ఆలోచిస్తున్నారా.?