హుజూర్‌నగర్ పోలింగ్‌కు సర్వం సిద్ధం: మహారాష్ట్ర, హర్యానాల్లోనూ రేపే

By sivanagaprasad KodatiFirst Published Oct 20, 2019, 8:57 PM IST
Highlights

హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం జరిగే పోలింగ్‌కు సంబంధించి 302 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. 1500 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. మరోవైపు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు కూడా సోమవారం పోలింగ్ జరగనుంది

హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం జరిగే పోలింగ్‌కు సంబంధించి 302 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. 1500 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఈనెల 24న ఉపఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

నియోజకవర్గంలో 79 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 967 బ్యాలెట్‌ యూనిట్లు, 363 కంట్రోల్‌ యూనిట్లతో పాటు 378 వీవీ ప్యాట్‌ లను ఉపయోగిస్తున్నారు. హుజూర్‌ నగర్‌ లో మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లు ఉన్నారు.

మరోవైపు పోలింగ్ సజావుగా సాగేందుకు గాను పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. సుమారు 2 వేలకు పైగా పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. హుజూర్‌ నగర్ మార్కెట్ గోదాం నుంచి ఈవీఎంలను పోలింగ్ సిబ్బంది తీసుకెళ్లారు. 

హుజూర్‌నగర్‌లో ఆయనకేం పని: ఉత్తమ్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి ఆయనను బయటకు పంపించాలని ఫిర్యాదులో కోరింది.

కోదాడకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచార గడువు ముగిసినప్పటికీ ఇంకా హుజూర్‌నగర్‌లోనే ఉన్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా హుజూర్‌నగర్‌లో ప్రెస్ మీట్ పెట్టినందుకు గాను ఆయనపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు ఈసీని కోరారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఇప్పటికీ పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదంటు వారు ఎన్నికల సంఘంపై అసహనం వ్యక్తం చేశారు. 

పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ వద్ద జారిపడిన పైప్.. తప్పిన ప్రమాదం

మరోవైపు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు కూడా సోమవారం పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. బరిలో మొత్తం 3,529 మంది అభ్యర్ధులు ఉన్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం 90,403 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హర్యానా విషయానికి వస్తే ఇక్కడ 90 నియోజకవర్గాలకు గాను 1,168 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. పోలింగ్ కోసం ఈసీ 19,425 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. కోటి 82 లక్షల 98 వేల 714 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ నెల 24న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది. మరోవైపు ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ.. సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.

ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఎదుర్కొంటున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు మహారాష్ట్ర, హర్యానా. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యపై సుప్రీం విచారణ నేపథ్యంలో బీజేపీ ఆశలు పెట్టుకుంది. 

click me!
Last Updated Oct 20, 2019, 9:00 PM IST
click me!