కాంగ్రెస్‌కు షాక్...టిపిసిసి అధికార ప్రతినిధి రాజీనామా

By Arun Kumar PFirst Published Nov 20, 2018, 6:38 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవడంతో కాంగ్రెస్ పార్టీ సపలమైంది.. కానీ ఇలా ఏర్పడిన మహాకూటమిలోని పార్టీల మధ్య పొత్తులు, సీట్ల కేటాయింపులో మాత్రం కాంగ్రెస్ నానా  తంటాలు పడాల్సివచ్చింది. ఎలాగోలా వీటన్నింటి దాటుకుని అభ్యర్థులను ప్రకటించగా అది తీవ్ర గందరగోళానికి దారితీసింది. సీటు ఆశించి భంగపడి, తమ స్థానాన్ని ఇతర పార్టీకి కేటాయించడం ఇలా వివిధ కారణాలతో అవకాశం లభించని నాయకులు కొందరు రెబల్స్‌గా బరిలోకి దిగుతుండగా మరికొందరు ఏకంగా పార్టీనే వీడారు. 

నామినేషన్ల దాఖలు గడువు ముగిసినా కాంగ్రెస్ అసంతృప్తుల్లో ఆగ్రహం మాత్రం  తగ్గడంలేదు. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ  తగిలింది.కాంగ్రెస్ రాష్ట్రస్థాయి సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. 

 టీపీసీసీ అధికార ప్రతినిధి తుమ్మేటి సమ్మిరెడ్డి, సీనియర్‌ నాయకుడు పరిపాటి రవీందర్‌రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పాడి కౌశిక్‌రెడ్డికి అవకాశం కల్పించడంతో వీరు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే రాజీనామా చేసిన వీరు స్థానిక టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందన్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. 

click me!
Last Updated Nov 20, 2018, 6:38 PM IST
click me!