Huzurabad bypoll Result 2021: తొమ్మిదో రౌండ్‌లో గెల్లుపై ఆధిక్యతను సాధించిన ఈటల

By narsimha lodeFirst Published Nov 2, 2021, 2:05 PM IST
Highlights

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 9వ రౌండ్ లో కూడా  ఆధిక్యాన్ని సాధించారు. ఈ రౌండ్‌లో బీజేపీ అభ్యర్ధి తన సమీప ప్రత్యర్ధి టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ పై 1835 ఓట్ల మెజారిటీని సాధించారు

హుజూరాబాద్: Huzurabad bypollలో తొమ్మిదవ రౌండ్‌లో కూడా బీజేపీ అభ్యర్ధి Etela Rajender   టీఆర్ఎస్ అభ్యర్ధి Gellu Srinivas Yadavపై  1835 ఓట్ల  ఆధిక్యంలో నిలిచారు. తొమ్మిది రౌండ్లను కలుపుకొంటే 5,105 ఓట్ల మెజారిటీలో ఈటల రాజేందర్ నిలిచారు. 

also read:Huzurabad bypoll Result 2021: గెల్లు స్వగ్రామంలో ఈటలదే పైచేయి, ఎనిమిదో రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

ఎనిమిదో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 4248 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 4086 ఓట్లు లభించాయి.  ఎనిమిదో రౌండ్ లో మాత్రమే ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ 162 ఓట్ల మెజారిటీని దక్కించుకొన్నారు.

వీణవంక మండలంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా టీఆర్ఎస్ పై చేయి సాధించింది. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్  స్వగ్రామం హిమ్మత్ పూర్, మరోవైపు టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి గ్రామం కూడా ఉంది. అయితే హిమ్మత్ పూర్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్  కంటే 190 ఓట్లను ఈటల రాజేందర్ ఎక్కువ పొందారు.దీంతో ఈ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి శ్రీనివాస్ యాదవ్ కు ఆధిక్యం లభించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

మొన్న ముగిసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.....ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన  పోలింగ్ సాయంత్రం ఏడు గంటల వరకు జరిగింది. హుజురాబాద్ నియోజకవర్గం లో 306 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసారు.. నియోజకవర్గం లోని ఐదు మండలాలలో మొత్తం 2,37,036 ఉండగా పురుషులువ1,17,933 కాగా స్త్రీలు 1,19,102 ఉండగా ఇతరులు ఒక్క ఓటరు ఉన్నారు..ఇక హుజురాబాద్ ఉప ఎన్నికలని కోవిడ్ నిబంధనలు అనుసరించి నిర్వహించారు..నియోజకవర్గం లో  144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ కన్నల్ ఇప్పటికే తెలిపాడు..ఉప ఎన్నిక కొసం 421 కంట్రోల్ యూనిట్లు,891 బ్యాలెట్ యూనిట్లు,515 వివి ప్యాడ్ యూనిట్లని వినియోగించారు... మొత్తం 1715 మంది సిబ్బందిని వినియోగించారు..306 పోలింగ్ స్టేషన్ లలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించారు..!

పోలింగ్ కేంద్రం నకి వచ్చే ప్రతి ఓటరు సానిటైజ్ చేసుకొనేలా ఏర్పాటు చేసారు..ప్రతి పోలింగ్ కేంద్రంలో హెల్త్ వర్కర్స్ థర్మమీటర్ తో టెంపరేచర్ ని పరీక్షించి లోపలికి పంపుతారు..ఓటు హక్కు వినియోగించుకునే కోవిడ్ పేషెంట్ లకి ప్రత్యేక పిపిఈ కిట్లు,కుడి చెతికి గ్లౌజులు అందించారు..సోషల్ మిడియాలో వచ్చే ఫేక్ వార్తలు నమ్మవద్దని ప్రజలు శాంతియుత వాతావరణం లో ఓటు హక్కు,స్వేచ్ఛా గా వినియోగించుకోవాలని కోరారు..3880 మంది పోలిసులతో పటిష్ఠమైన బందోభస్తుని ఏర్పాటు చేసారు..

ఈటెల అక్రమాలకు పాల్పడ్డాడనే కారణంతో ఆయనపై సీఎం కేసీఆర్ విచారణ చేపట్టడం... ఆవెంటనే ఈటెల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం... ఆ తరువాత తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.  ఈ నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నికల్లో తెరాస తరుఫు నుంచి విద్యార్ధి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా... బీజేపీ నుంచి ఈటెల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచాడు. ప్రధానంగా పోటీ ఈ మూడు పార్టీల మధ్యనే నెలకొన్నప్పటికీ... కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు విజేతను నిర్దేశించనున్నాయి..!

ఇక ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో అత్యధిక సర్వేలు బీజేపీ వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే..! నాగన్న సర్వే మినహా మిగితా అన్ని సర్వేలు ఈటెల గెలుస్తాడని తెలిపాయి. ఇక్కడ జరిగిన ఎన్నిక తెరాస వర్సెస్ బీజేపీ గా కన్నా ఈటెల వర్సెస్ కేసీఆర్ గా జరిగాయి. పూర్తిగా పోలరైజ్డ్ గా సాగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం అత్యల్పంగా ఉండి ... డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితి కనబడడం లేదు..!
 


 

click me!