
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ముమ్మరంగా చేపట్టిన ప్రచారపర్వం చివరిదశకు చేరుకుంది. ఇదే కీలకసమయం. ఈ సమయంలో పార్టీలు చెప్పే మాటలు, భావోద్వేగ ప్రసంగాలు పోలింగ్ వరకు ప్రజలకు గుర్తుంటాయి. అందుకే పోలింగ్ కు మూడునాలుగు రోజులముందే పార్టీలన్నీ తమను గెలిపించే అస్త్రాలన్నింటిని బయటకు తీస్తుంటాయి. ఇలా ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా భావోద్వేగంతో ప్రసంగిస్తూ టీఆర్ఎస్ వైపు ఓటర్లను మల్లించే ప్రయత్నం చేస్తున్నారు.
huzurabad నియోజకవర్గ పరిధిలోని సింగాపురం గ్రామంలో మంత్రి harish rao ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాకు అన్నం పెట్టిన ఊరు ఈ సింగాపురం అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ తో పాటు తనకు కూడా ఈ ఊరు ఆతిధ్యం ఇచ్చిందని... ఇప్పుడు మరోసారి మమ్మల్ని ఆశీర్వదించాలని హరీష్ కోరారు.
''నాకు అన్నం పెట్టిన singapuram గ్రామమంటే నాకెంతో ఇష్టం. మీరంతా మాకు అండగా నిలవాలి. టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండి. మీరు ఆశీర్వదిస్తే ఇంకా కష్టపడి పని చేస్తాం. మీ రుణం తీర్చుకుంటాం'' అని హరీష్ అన్నారు.
''అబద్దాల BJP మాటలు నమ్మవద్దు. అయినా బీజేపీ గెల్చేదిలేదు... ప్రభుత్వం వచ్చేది లేదు... ఈటల మంత్రి అయ్యేది లేదు. మన టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగ నడుస్తుంది... ఇలాంటి సమయంలో ధరలుపెంచిన బీజేపీ మనకు ఎందుకు. ఈ బీజేపీ , Eatala Rajender హుజూరాబాద్ కు ఏం చేసిండ్రు'' అని హరీష్ అడిగారు.
వీడియో
''మన ప్రభుత్వం ఆసరా ఇస్తున్నామా లేదా... కళ్యాణ లక్ష్మి ఇస్తున్నమ్మా లేదా... ఇవి కడుపు నింపవని రాజేందర్ అన్నాడు. కేసీఆర్ కిట్ పనికి రాదట, రైతు బంధు డండగ అట. ఆసరా పెన్షన్ పరిగ ఎరుకున్నట్లని ఈటల అంటున్నాడు. నీవు శ్రీమంతుడవి... నీకు అవసరం లేకపోవచ్చు రాజేందర్... కాని తాతఅవ్వలకు కొండంత ఆత్మవిశ్వాసం కల్పించాయి ఈ ఆసరా ఫించన్లు'' అని మంత్రి హరీష్ పేర్కొన్నారు.
read more Huzurabad Bypoll: ఈటలను చూసి అయ్యో అయ్యో అని జాలిపడకండి...: మంత్రి కొప్పుల ఈశ్వర్
సోమవారం కూడా మంత్రి హరీష్ రావు ఇల్లందకుంట దళితవాడలో కొద్దిసేపు ఆగి కాలనీ వాసులతో మాట్లాడారు. దళిత బందుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని... ఈ పథకాన్ని గ్రౌండ్ చేయకపోతే తన పేరు మార్చుకుంటానని హరీష్ సవాల్ విసిరారు.
''దళితులూ ఆలోచించాలి. ఇది నడుమంత్రపు ఎలక్షన్. ఇంకా రెండేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. సిఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకాన్ని మొదట దళితులకే ఇచ్చారు. కానీ తదనంతరం అందరికి వర్తింపచేసారు. దళిత బంధు కూడా అంతే... భవిష్యత్తులో అందరికి అమలు చేస్తాం'' అన్నారు.
''ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండి. ఆర్థిక మంత్రిగా అందరికి అండగా ఉండి, దగ్గరుండి పనులు చేయిస్తా.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును మరింత జోష్ తో ముందుకు తీసుకుపోతాం'' అని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.