హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 22 రౌండల్లో ఓట్ల లెక్కింపు సాగుతుంది.భారీగా పోలింగ్ శాతం నమోదు కావడంతో తుది ఫలితం రావడానికి మధ్యాహ్నం పూర్తయ్యే అవకాశం ఉంది.
హుజూరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మంగళవారం నాడు ప్రారంభమైంది.హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. గత నెల 30వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
also read:Huzurabad bypoll... ఆ వీవీప్యాట్‌తో ఎన్నికలకు సంబంధం లేదు: శశాంక్ గోయల్
undefined
ఈ ఉప ఎన్నికల్లో Etela Rajender ను ఓడించి ఆయనను రాజకీయంగా దెబ్బ తీయాలని Trs నాయకత్వం సర్వశక్తులు ఒడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించిKcr కు సవాల్ విసరాలని Bjpఈ ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకొంది. అసైన్డ్, దేవాలయ భూములన ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి కేసీఆర్ భర్తరఫ్ చేశారు. దీంతో Huzurabad bypoll ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
ఇవాళ ఉదయం 8 గంటల నుండి Karimnagarలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో Counting ప్రారంభమైంది.. సుమారుగా 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.తొలుత హుజూరాబాద్ మండలంలోని 14 గ్రామాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. హుజూరాబాద్‌లోని పోతిరెడ్డిపేట ఓట్లతో కౌంటింగ్ ప్రారంభంకానుంది. కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామం ఓట్లతో కౌంటింగ్‌తో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా వుండటం పోలింగ్ శాతం కూడా భారీగా నమోదవడంతో గతంలో కంటే కాస్త ఆలస్యంగానే ఫలితం వెలువడనుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహరీ సాగనుండటంతో చివరి రౌండ్ వరకు ఫలితం దోబూచులాడనుంది. రౌండ్‌రౌండ్‌కి టెన్షన్ పెంచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
మొదటి అరగంటపాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ఉంటుంది. మొత్తం 753 మంది పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఒక హాల్‌లో 7 టేబుల్స్, మరో హాల్‌లో 7 టేబుల్స్ చొప్పున ఒక్క రౌండుకు 14 ఈవీఎంల చొప్పున లెక్కిస్తారు. 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. రాజకీయ పార్టీల అభ్యర్థుల తరపున వాళ్ల ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ కొనసాగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది ఫలితం విడుదల కానుంది.
రెండు కౌంటింగ్ కేంద్రాల్లోని అన్ని టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో పోలయిన ఓట్లను 22 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్‌కు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు జరగనున్న కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వద్దే కాకుండా సున్నితమైన ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసారు. లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 700మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. కరీంనగర్ టు జగిత్యాల రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
భారీగా పోలింగ్.. మధ్యాహ్నం తర్వాత తుది ఫలితం
పోలింగ్ రోజున హుజురాబాద్ లో ఓటర్లు పోటెత్తారు. ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద క్యూ కట్టారు. దీంతో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. హుజురాబాద్ నియోజకవర్గంలో 2018 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో 84 శాతం పైగా పోలింగ్ నమోదవగా ఈ సారి మాత్రం 86.57 శాతం పోలైంది. అంటే గంతలో కంటే 2.5 శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారో ఎన్నికల ఫలితం తేల్చనుంది.
ఇక ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో అత్యధిక సర్వేలు బీజేపీ వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే..! నాగన్న సర్వే మినహా మిగతా అన్ని సర్వేలు ఈటెల రాజేందర్ గెలుస్తాడని తెలిపాయి. ఇక్కడ జరిగిన ఎన్నిక తెరాస వర్సెస్ బీజేపీ గా కన్నా ఈటెల వర్సెస్ కేసీఆర్ గా జరిగాయి.