వరకట్నం, అనుమానం.. భార్యను చంపిన భర్త, ఆ ఇంట్లో దుర్వాసన వస్తుండటంతో

Siva Kodati |  
Published : Aug 08, 2023, 06:35 PM IST
వరకట్నం, అనుమానం.. భార్యను చంపిన భర్త, ఆ ఇంట్లో దుర్వాసన వస్తుండటంతో

సారాంశం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో భార్యను చంపాడో భర్త. అనంతరం పిల్లలతో కలిసి పరారయ్యాడు. వరకట్నపు వేధింపులు, అనుమానంతోనే భార్యను హత్య చేసి వుంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు. 

భార్యను చంపి పిల్లలతో పరారయ్యాడో వ్యక్తి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఈ దారుణం జరిగింది. ఇంట్లో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దిండుతో నొక్కి భార్యను ఊపిరాడకుండా చంపినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. వరకట్నపు వేధింపులు, అనుమానంతోనే భార్యను హత్య చేసి వుంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు. నిందితుడిని నర్సింహులుగా గుర్తించారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?