అసలు నీ జీతమెంత అన్నందుకు : ఎన్ఆర్ఐ భర్త వేధింపులు, రెండో పెళ్లి

By sivanagaprasad kodatiFirst Published Jan 21, 2019, 12:15 PM IST
Highlights

భారీగా కట్న కానుకలు తీసుకుని పెళ్లయిన తర్వాత భార్యకు తన నిజ స్వరూపం చూపించాడు ఓ ఎన్ఆర్ఐ భర్త. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా నూజివీడు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కన్నికంటి వంశీకృష్ణ పదేళ్లుగా ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

భారీగా కట్న కానుకలు తీసుకుని పెళ్లయిన తర్వాత భార్యకు తన నిజ స్వరూపం చూపించాడు ఓ ఎన్ఆర్ఐ భర్త. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా నూజివీడు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కన్నికంటి వంశీకృష్ణ పదేళ్లుగా ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

2015 ఆగస్టులో బంజారాహిల్స్‌కు చెందిన సిరిచందన అనే యువతిని 2015 ఆగస్టులో పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో రూ.30 లక్షల నగదు, 40 సవర్ల బంగారాన్ని కట్నం కింద సిరిచందన తల్లిదండ్రులు ఇచ్చారు.

పెళ్లయిన 20 రోజులకు భార్యను తీసుకుని ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ కొత్తకాపురం పెట్టాడు వంశీకృష్ణ. అయితే అక్కడికి వెళ్లినప్పటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధించాడు. అలాగే పెళ్లికి ముందు తనకు నెలకు రూ. 4.50 లక్షల వేతనమని నమ్మించాడు.

ఈ విషయాన్ని గమనించిన సిరి భర్తను నిలదీయడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని ఆమె తల్లీదండ్రులు, అత్తమామల దృష్టికి తీసుకెళ్లారు. మనదేశానికి వచ్చి కుటుంబ పెద్దల సమక్షంలో రాజీ చేసుకుందామని ఆమెకు చెప్పి 2016లో ఆమెను వంశీ ఇండియాకు పంపాడు.

ఇక్కడకు రాగానే సిరిచందన వీసా, పీఆర్‌ను రద్దు చేసి తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లలేని స్థితిని కల్పించాడు. అప్పటి నుంచి ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి ఆస్ట్రేలియాలోని న్యాయవాది ద్వారా విడాకుల నోటీసు పంపాడు.

సిరిచందనకు ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో అక్కడి కోర్టు దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలో వంశీకృష్ణ తనకు మరదలి వరస అయ్యే అనంతనేని రాధ అనే యువతిని 2018 నవంబర్‌లో వివాహం చేసుకున్నాడు.

ఇది తెలుసుకున్న బాధితురాలు భారత్‌లో పెళ్లయితే ఆస్ట్రేలియా కోర్టు మంజూరు చేసే విడాకులు చెల్లవని భర్త వంశీకృష్ణ, అత్తమామలు, రెండో భార్య రాధపై బంజారాహిల్స్ పోలీసులకు జనవరి 6న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్తమామలతో పాటు రాధను అదుపులోకి తీసుకున్నారు. వంశీకృష్ణ ఆస్ట్రేలియాలో ఉండటంతో పోలీసులు అక్కడికి నోటీసులు పంపారు. 
 

click me!