మాయమాటలు చెప్పి.. బాలికపై అత్యాచారం.. హోంగార్డు అరెస్ట్..

Published : Feb 22, 2021, 10:14 AM IST
మాయమాటలు చెప్పి.. బాలికపై అత్యాచారం.. హోంగార్డు అరెస్ట్..

సారాంశం

హైదరాబాద్, అడ్డగుట్టలో దారుణం జరిగింది. మాయమాటలతో మభ్యపెట్టి ఓ మైనర్‌ బాలికపై హోం గార్డు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. 

పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అడ్డగుట్టలోని కమ్యూనిటీహాలు ప్రాంతానికి చెందిన మల్లికార్జున్‌ (40) హోంగార్డు. హైద్రాబాద్‌ సీసీఎస్‌లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  అయితే ఇటీవల అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. 

ఆ పరిచయాన్ని ఆ బాలికను మభ్యపెట్టి, మోసం చేయడానికి ఉపయోగించాడు. బాలిక ఇంట్లో ఎవరూలేని సమయంలో చూసి అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని ఆమెను భయపెట్టాడు. అయితే, రెండు రోజులుగా బాలిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా జరిగిన విషయం తెలిపింది. 

బాధితులు స్థానిక తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మల్లికార్జున్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.  

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu