ప్రేమ పేరుతో హోంగార్డు మోసం: బిడ్డకు జన్మనిచ్చి మరణించిన యువతి

Siva Kodati |  
Published : Aug 11, 2019, 03:28 PM ISTUpdated : Aug 11, 2019, 03:42 PM IST
ప్రేమ పేరుతో హోంగార్డు మోసం: బిడ్డకు జన్మనిచ్చి మరణించిన యువతి

సారాంశం

ఆసిఫాబాద్ జిల్లాలోని సజ్జన్‌లాల్ అనే ఏఆర్ కానిస్టేబుల్‌కు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. అయినప్పటికీ ప్రేమ పేరుతో ధాంపూర్‌కు చెందిన అరుణ అనే యువతిని లోబరుచుకుని... గత కొంతకాలంగా సహజీవనం చేస్తుండటంతో ఆమె గర్భం దాల్చింది

ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పిన ఓ హోంగార్డ్ యువతిని గర్భవతిని చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఆసిఫాబాద్ జిల్లాలోని సజ్జన్‌లాల్ అనే ఏఆర్ కానిస్టేబుల్‌కు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు.

అయినప్పటికీ ప్రేమ పేరుతో ధాంపూర్‌కు చెందిన అరుణ అనే యువతిని లోబరుచుకుని... గత కొంతకాలంగా సహజీవనం చేస్తుండటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ క్రమంలో అరుణకు ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో సజన్‌లాల్‌ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఆలస్యం చేశాడు.

దీంతో అరుణ మార్గమధ్యంలోనే మగబిడ్డకు జన్మనిచ్చి మృతి చెందింది. దీంతో భయపడిపోయిన సజన్‌లాల్ ఆమె భౌతికకాయాన్ని ప్రభుత్వాసుపత్రిలో వదిలేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న అరుణ బంధువులు ఆసుపత్రికి చేరుకుని.. న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని తీసుకు వెళ్లేది లేదని ఆందోళనకు దిగారు.

ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లాకే చెందిన ఓ కానిస్టేబుల్ ఓ వ్యక్తి మహిళల అక్రమ రవాణా కేసులో జైలు పాలయ్యాడు. ఇక లక్సెట్టిపేటకు చెందిన రిజర్వ్ సీఐ శ్రీనివాస్‌పై 498-ఎ కేసు విచారణ జరుగుతుండటంతో జిల్లా పోలీసులు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Medaram Jatara: మేడారం వెళ్లలేక‌పోతున్నారా.? ఏం ప‌ర్లేదు ప్ర‌సాదం మీ ఇంటికే వ‌స్తుంది. ఎలాగంటే..
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు.. ఎలా ఉండనున్నాయో తెలుసా..?