తెలంగాణలో ‘రంగుల’ విషాదం

First Published Mar 12, 2017, 2:49 PM IST
Highlights
  • విషాదం మిగిల్చిన హోలీ పండగ

తెలంగాణ లో రంగుల పండగా విషాదంగా మారింది. హోలీ వేడుకల అనంతరం చెరువులో స్నానాలకు వెళ్లి  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల 10మంది మృతి చెందారు, ఇద్దరు గల్లంతయ్యారు.

 

సిద్దిపేట జిల్లా తొగుట మండలం వరదరాజ్‌పల్లి కి చెందిన  ప్రశాంత్‌(13), శ్రీకాంత్‌(9) ఊరి చెరువులో స్నానానికి వెళ్లి మునిగిపోయారు.

 

జనగాం జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూరులో హోలీ తర్వాత రిజర్వాయర్‌లో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు క్రాంతి కుమార్‌, నాగరాజుగా గుర్తించారు.

 

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. దొద్దికుంట చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు వీరేందర్‌(8), చరణ్‌(9)గా గుర్తించారు.

 

భద్రాచలం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

 

నల్గొండ జిల్లా ఉదయసముద్రం చెరువులో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు.

 

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురంలో హోలీ వేడుకలో విషాదం చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి నరేశ్‌ అనే యవకుడు మృతి చెందాడు.

 

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువలోకి స్నానానికి వెళ్లి ఇంటర్‌ విద్యార్థి గల్లంతయ్యాడు.

 

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం అనంతసాగర్‌ చెరువులో యువకుడు గల్లంతయ్యాడు. 

 

click me!