
తెలంగాణలో మరోసారి ప్రభుత్వ భూముల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సవ్యంగా నడిపించేందుకు, ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూములను వేలం వేయడానికి కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. భారీ ఆదాయమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక, భూముల వేలానికి సంబంధించి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలని భూములను పలు ప్రభుత్వ భూములను అమ్మకానికి ఉంచింది.
300 గజాల నుంచి 10 వేల గజాల వరకు ప్లాట్లను వేలంలో పెట్టింది. రిజిస్ట్రేషన్‌కు 2023 జనవరి 16 తుది గడవుగా నిర్ణయించింది. ఈఎండీ చెల్లింపునుకు జనవరి 17 వరకు గడువు విధించింది. ఇక, జనవరి 18 భూముల వేలం ప్రక్రియ చేపట్టనుంది. ఇందుకు సంబంధించి జనవరి 4,5,6 తేదీల్లో ప్రీబిడ్ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా హెచ్‌ఎండీఏ తెలిపింది. ఇక, గతంలో కూడా ప్రభుత్వ భూములను కేసీఆర్ సర్కార్ భారీగా ఆదాయం సమకూర్చుకున్న సంగతి తెలిసిందే.