ది కాశ్మీర్ ఫైల్స్ vs మోడీ డాక్యుమెంటరీ : ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ పోటాపోటీ ప్రదర్శనలు.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Jan 26, 2023, 07:13 PM IST
ది కాశ్మీర్ ఫైల్స్ vs మోడీ డాక్యుమెంటరీ : ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ పోటాపోటీ ప్రదర్శనలు.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత

సారాంశం

హైదరాబాద్‌లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. దీనికి కౌంటర్‌గా మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఎస్ఎఫ్ఐ యత్నించింది.

హైదరాబాద్‌లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘాలు గురువారం ఆందోళనలు నిర్వహించాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. దీనికి కౌంటర్‌గా మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఎస్ఎఫ్ఐ యత్నించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు విద్యార్ధి సంఘాలను అడ్డుకున్నారు. క్యాంపస్‌లో సినిమా ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. అనంతరం ఫిల్మ్ ప్రొజెక్టర్‌ను సీజ్ చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో హెచ్‌సీయూలో భారీగా పోలీసులు మోహరించారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?