భద్రతావలయంలో కొంగరకలాన్

By rajesh yFirst Published Sep 2, 2018, 12:53 PM IST
Highlights

టీఆర్ ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నప్రగతి నివేదన సభ ప్రాంగణాన్ని పోలీసులు భారీగా మోహరించారు. సాయంత్రం  నిర్వహించనున్న సభకు దాదాపుగా 25 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్ననేపథ్యంలో ఏకంగా 20వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్‌: టీఆర్ ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నప్రగతి నివేదన సభ ప్రాంగణాన్ని పోలీసులు భారీగా మోహరించారు. సాయంత్రం  నిర్వహించనున్న సభకు దాదాపుగా 25 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్ననేపథ్యంలో ఏకంగా 20వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేంందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సభ జరగబోయే ప్రాంతంతో పాటు పరిసరాల్లో పెద్దఎత్తున పోలీసులు మోహరించారు.  

 సభ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన 200 సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా 43 కెమెరాలు 360 డిగ్రీల కోణంలో నిరంతరం తిరుగుతూ ఉండేలా సిద్దం చేశారు. సభా ప్రాంగణంలోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తి ఈ కెమెరాల్లో కనిపించేలా ప్లాన్ చేశారు పోలీసులు. 

ఎప్పటికప్పుడు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో దృశ్యాలను పరిశీలిస్తూ ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. సభ జరుగుతున్న తీరును నిరంతరం వీక్షించేందుకు వీలుగా పోలీస్‌ ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. 

click me!