వివేక్‌కు షాక్: హె‌చ్‌సిఏ అధ్యక్ష పదవి నుండి వైదొలగాలని హైకోర్టు ఆదేశం

First Published Jun 12, 2018, 12:24 PM IST
Highlights

వివేక్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

హైదరాబాద్:హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుండి మాజీ ఎంపీ వివేక్‌ను తొలగించాలని హైకోర్టు తీర్పు మంగళవారం నాడు తీర్పు వెలువరించింది.  గతంలో అంబుడ్స్‌మెన్  తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును హైకోర్టు సమర్ధించింది.


అంబుడ్స్ మెన్ తీర్పును  సవాల్ చేస్తూ మాజీ ఎంపీ వివేక్ హైకోర్టును ఆశ్రయించారు.ఈ తీర్పును అనుసరించి తక్షణమే వివేక్ హెచ్ సిఏ  అధ్యక్ష పదవి నుండి వైదొలగాలని తీర్పును వెలువరించింది.


లోథా కమిటి సిఫారసుల మేరకు క్రికెట్ సంఘాల్లో కీలక పదవులను అనుభవిస్తున్నవారు ఇతర లాభదాయకపదవుల్లో కొనసాగకూడదు. దీని కారణంగానే అంబుడ్స్ మెన్ వివేక్ ను హెచ్ సి ఏ అధ్యక్ష పదవి నుండి తొలగిస్తూ హైకోర్టు మంగళవారం నాడు తీర్పు వెలువరించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహదారుడి పదవిలో కూడ కొనసాగుతున్నారు. ఈ పదవిలో వివేక్ కొనసాగడంపై అంబుడ్స్‌మెన్ కు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగానే హెచ్ సి ఏ నుండి వివేక్ ను వైదొలగాలని అంబుడ్స్‌మెన్ సూచించింది. కానీ, వివేక్ వైదొలగలేదు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు కూడ అంబుడ్స్‌మెన్ తీర్పును సమర్ధించింది.

click me!