తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి భద్రతను పెంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పలువురి నుంచి తనకు ప్రాణహానీ ఉండటంతో పాటు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాల్సి ఉండటంతో తనకు 4 ప్లస్ 4 భద్రతను కల్పించాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రేవంత్‌కు అదనపు భద్రతను కల్పించాల్సిందిగా కేంద్రప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందుకు అవసరమైన ఖర్చను మాత్రం రేవంతే భరించాలని పేర్కొంది.