చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు

By narsimha lodeFirst Published Jul 10, 2019, 5:10 PM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్  పౌరసత్వం వివాదంపై మూడు నెలల్లోపు తేల్చాలని కేంద్ర హోంశాఖను  హైకోర్టు ఆదేశించింది  చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై  ఆయన ప్రత్యర్ధి శ్రీనివాస్  దాఖలు చేసిన  పిటిషన్‌పై బుధవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది.


హైదరాబాద్:  టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్  పౌరసత్వం వివాదంపై మూడు నెలల్లోపు తేల్చాలని కేంద్ర హోంశాఖను  హైకోర్టు ఆదేశించింది  చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై  ఆయన ప్రత్యర్ధి శ్రీనివాస్  దాఖలు చేసిన  పిటిషన్‌పై బుధవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు భారత పౌరసత్వం లేదని  విదేశీ పౌరసత్వం ఉందని ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనా చెల్లదని శ్రీనివాస్  హైకోర్టును ఆశ్రయించారు.  

ఎమ్మెల్యే రమేష్ పౌరసత్వంపై ఉన్న అభ్యంతరాలను  మూడు వారాల్లో కేంద్ర హోంశాఖకు తెలపాలని పిటిషనర్  శ్రీనివాస్ కు కోర్టు సూచించింది. మరో వైపు ఈ విషయమై మూడు వారాల్లో స్పష్టత ఇవ్వాలని  కేంద్ర హోంశాఖను హైకోర్టు ఆదేశించింది.చెన్నమనేని రమేష్ గత టర్మ్‌లో కూడ  టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఈ దఫా మరోసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 

click me!