షాక్: సూపర్ స్పెషాలిటీ మెడికల్ పీజీ కోర్సుల ఫీజుల పెంపుపై స్టే

Published : Aug 23, 2018, 02:39 PM ISTUpdated : Sep 09, 2018, 01:55 PM IST
షాక్: సూపర్ స్పెషాలిటీ మెడికల్ పీజీ కోర్సుల ఫీజుల పెంపుపై స్టే

సారాంశం

సూపర్ స్పెషాలిటీ మెడికల్ పీజీ కోర్సుల యాజమాన్య కోటా ఫీజులను రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచుతూ  తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న  జీవోపై  స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  


హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ మెడికల్ పీజీ కోర్సుల యాజమాన్య కోటా ఫీజులను రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచుతూ  తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న  జీవోపై  స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సూపర్ స్పెషాలిటీ మెడికల్ పీజీ కోర్సుయాజమాన్య కోటా ఫీజును రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచుతూ  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పెంచిన ఫీజులు 2018-19 నుండి అమల్లోకి  వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే  సూపర్ స్పెషాలిటీ మెడికల్ పీజీ కోర్సుల యాజమాన్య కోటా ఫీజును  రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై హెల్త్‌కేర్ రిఫామ్స్ అసోసియేషన్  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

ఈ పిటిషన్‌పై  కోర్టు విచారణ జరిపింది.ఈ విచారణలో  ఫీజుల పెంపునూ  హైకోర్టు తప్పుబట్టింది.పీజులు పెంచుతూ ఇచ్చిన జీవోపై రాష్ట్ర ప్రభుత్వం స్టే విధించింది. ఫీజుల పెంపుపై  స్టే విధించడాన్ని   హెల్త్ కేర్ రిఫామ్స్ అసోసియేషన్  హర్షం వ్యక్తం చేసింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu