
తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్టుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి జీవో నెంబర్ 57, 58లపై పలువురు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుకు నోటీసులు జారీచేసిన హైకోర్టు.. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వారం పాటు ఫలితాలు ఇవ్వొద్దని పేర్కొది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.