నాగం భద్రతపై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు

First Published Jul 5, 2018, 2:40 PM IST
Highlights

మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు నాగం  జనార్ధన్ రెడ్డి కి హైకోర్టులో ఊరట లభించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం తన భద్రతను ఉపసంహరించుకోడాన్ని సవాల్ చేస్తూ ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈయన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు నాగంకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆయన భద్రతను పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఇటీవల కాంగ్రెస్ లో చేరిస నాగం టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్, మంత్రులపై పెద్దఎత్తున విమర్శలు చేస్తున్న విశయం తెలిసిందే. అయితే గతంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని దృష్టిలో పెట్టుకుని మళ్లీ తనపై దాడి జరిగే అవకాశం ఉందని నాగం బావిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం గతంలో మాదిరిగా 1+1 భద్రతను పునరుద్ధరించేలా చూడాలని హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన కోర్టు నాగం కు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అంతేకాకుండా నాగం కు భద్రతను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరించాలని వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

నాగం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరుగుతోందంటూ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఇదివరకే టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు తనపై దాడిచేసే అవకాశం ఉందని నాగం ఆరోపిస్తున్నారు. అందువల్లే కోర్టునే ఆశ్రయించినట్లు, కోర్టు తనకు అనుకూలంగా మద్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆనందంగా ఉందని నాగం అన్నారు.

click me!