ఆంధ్రలో కోడి పందేలు: వాటికి తర్ఫీదు బార్కాస్ లోనే...

By Arun Kumar PFirst Published Jan 14, 2019, 3:30 PM IST
Highlights

సంక్రాంతి పండగ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కోళ్ల పందేలు. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే ఈ కోళ్ల పందేలకున్న  క్రేజు అంతా  ఇంతా కాదు. ఈ సంక్రాంతి సంబరాలు జరిగే మూడు రోజుల మామూలు ప్రజలేమో గానీ పందెం రాయుళ్లు తమ తరహాలో పండగ చేసుకుంటారు. కేవలం అక్కడి స్థానికులే కాదు తెలంగాణ నుండి కూడా కేవలం ఈ కోళ్ల పందేల కోసమే వెళ్లేవారు చాలామంది  వుంటారు. అయితే పందేలకు ఉపయోగించే కోళ్లు కూడా తెలంగాణ నుండే ఆంద్రాకు సరఫరా అవడం ఈ పండగకున్న మరో విశేషం.

మామూలు కోళ్లను పందెంకోళ్లుగా మార్చడమే హైదరాబాద్‌లోని బార్కస్ ప్రాంతానికి చెందిన కొన్ని కుటుంబాలు వృత్తిగా మార్చుకున్నాయి. అక్కడ వివిధ జాతులకు చెందిన కోళ్లకు ప్రత్యేక తర్పీదునిచ్చి పందెంకోళ్లుగా మార్చుతారు. అయితే ఇదేదో ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు. ఏడాది పాటు కష్టపడితే కాని ఓ కోడిని పందేనికి సిద్దం చేయలేమని  వ్యాపారి తెలిపారు. 

మొదట బలవర్ధకంగా వుండే ప్రత్యేక జాతులకు చెందిన కోళ్ళను ఇతర ప్రాంతాలను నుండి బార్కస్ వ్యాపారులు తెప్పించుకుంటారు. వాటికి రోజూ ప్రత్యేక శిక్షణ, బలవర్ధకమైన ఆహారం ఇచ్చి పెంచుతారు. తర్పీదు సమయంలో కోళ్ళకు మాలిష్ చేయడం, ఈత  కొట్టించడం చేయిస్తారు. అంతేకాకుండా జిడి పప్పు, బాదం పప్పు వంటి ఆహార పదార్థాలు అందిస్తారు. ఇందుకోసం ఒక్కో కోడికి వేలల్లో ఖర్చు చేస్తారు. 

ఇక సంక్రాంతి పండగకు కొద్ది రోజుల ముందు కోళ్లను మరింత సానబెడతారు. పందెంలో ఇతర కోళ్లను ఎలా ఎదుర్కోవాలో...పోటీలో ఎలా దూకుడుగా ఉండాలో తర్పీదు ఇస్తారు. దీని కోసం ప్రత్్యేకంగా కోళ్ల మధ్య పోటీని కూడా నిర్వహిస్తారు. ఇలా వారు పెట్టిన పోటిల్లో మంచి ప్రదర్శన చేసిన కోళ్లను అత్యధిక ధరను కేటాయిస్తారు. 

కేవలం ఇలా కోళ్లకు తర్పీదు ఇవ్వడానికే బార్కస్ ప్రాంతంలో ప్రత్యేక ట్రెయినర్లు వుంటారంటే ఆశ్యర్యం కలుగక మానదు. ప్రస్తుతం పందెంకోళ్లతో పాటు వాటికి ప్రత్యేక తర్ఫీదునిచ్చిన శిక్షకులు సైతం ఆంంధ్ర ప్రదేశ్ బాట పట్టారు. అక్కడ నిర్వహకులు ఈ ట్రెయినర్లకు ప్రత్యేక సదుపాయాలు, వేతనం చెల్లించి  మరీ తీసుకువెళుతున్నారు. ఇలా  ఆంధ్ర ప్రదేశ్ కోళ్ల పందెంలో పాల్గొనే చాలా పందేంకోళ్లు తెలంగాణ  నుండి వెళ్లినవే కావడం విశేషం. 
 
click me!