హైద్రాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం

Published : May 31, 2020, 03:17 PM ISTUpdated : May 31, 2020, 03:21 PM IST
హైద్రాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం

సారాంశం

హైద్రాబాద్ నగరంలో పలు చోట్ల ఆదివారం నాడు మధ్యాహ్నం కురిసింది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైద్రాబాద్ తో పాటు తెలంగాణలోని పలు చోట్ల వర్షం కురిసింది.  


హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో పలు చోట్ల ఆదివారం నాడు మధ్యాహ్నం కురిసింది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైద్రాబాద్ తో పాటు తెలంగాణలోని పలు చోట్ల వర్షం కురిసింది.

ఆదివారం నాడు మధ్యాహ్నం పాటు ఒక్కసారిగా వర్షం కురిసింది.ఇవాళ ఉదయం నుండి ఎండ లేదు. కానీ ఉక్కపోత ఎక్కువగా ఉంది. మధ్యాహ్ననికి వాతవరణం ఒక్క సారిగా మారింది.ఈదురుగాలులతో వర్షం ప్రారంభమైంది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, మలక్ పేట, చంపాపేట, సరూర్ నగర్, మల్కాజిగిరి, నేరేడ్ మెట్, ఈసీఐఎల్, నాగారం, జవహర్ నగర్, కీసర,అంబర్ పేట, కూకట్ పల్లి, దమ్మాయిగూడ, తుర్కయంజాల్, బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, కాచిగూడ, నల్లకుంట, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హస్తినాపురం ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్టు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడ వర్షం కురిసింది.హైద్రాబాద్ లో కూడ భారీ వర్షం కారణంగా రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. ఏపీ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో కూడ వర్షం కురిసింది.

ఈ వర్షం కారణంగా ఇంత కాలం పాటు ఎండ వేడితో ఇబ్బంది పడిన ప్రజలకు కొంత ఊరట లభించింది. వారం రోజులకు పైగా అత్యధిక ఉష్ణోగ్రత్తు నమోదౌతున్న విషయం తెలిసిందే.

ఉపరితలంపై ద్రోణి ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోకి జూన్ 5వ తేదీన రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?