హైద్రాబాద్‌లో భారీ వర్షం, ట్రాఫిక్ జామ్: లోతట్టు ప్రాంతాలు జలమయం

By narsimha lodeFirst Published Aug 23, 2021, 7:27 PM IST
Highlights

హైద్రాబాద్ నగరంలో  సోమవారం నాడు వర్షం కురిసింది. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది.

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో సోమవారం నాడు సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

హైద్రాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, అమీర్ పేట, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట , చంపాపేట, సరూర్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. 

ఒక్కసారిగా భారీగా వర్షం కురవడంతో  ఆఫీసుల నుండి ఇళ్లకు చేరుకొనే ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు.  ఫ్లై ఓవర్లు, చెట్ల నీడలో వర్షం నుండి కాపాడుకొన్నారు.ఇళ్లలోకి, షాపింగ్ కాంప్లెక్స్‌లోకి నీరు చేరింది. 

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ , సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ తెలిపింది.

click me!