నాగర్ కర్నూల్ లో భారీ వర్షం.. మిద్దె కూలి దంపతుల మృతి...

Published : Sep 05, 2022, 11:10 AM IST
నాగర్ కర్నూల్ లో భారీ వర్షం.. మిద్దె కూలి దంపతుల మృతి...

సారాంశం

నాగర్ కర్నూల్ లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు మట్టిమిద్దె కూలడంతో ఓ దంపతులు మృత్యువాత పడ్డారు. 

నాగర్ కర్నూల్ : జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. అర్ధ రాత్రి కురిసిన భారీవర్షానికి ఇంటి మట్టి మిద్దె కూలింది. దీంతో నిద్రిస్తున్న ఇద్దరు దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. భార్య భర్తలు ఇద్దరు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు భోగరాజు చంద్రయ్య (65), వెంకటమ్మ (62)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Dasara Special Trains: గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. దసరా బతుకమ్మ ప్రత్యేక రైళ్లు