అంగన్ వాడీ టీచర్ మృతి: కరోనా టీకా కారణమన్న ఫ్యామిలీ, నిర్ధారించని అధికారులు

By narsimha lodeFirst Published Jan 31, 2021, 12:02 PM IST
Highlights

కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న అంగన్ వాడీ టీచర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకొంది.

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న అంగన్ వాడీ టీచర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకొంది.

మంచిర్యాల జిల్లాకు చెందిన సుశీల అనే అంగన్ వాడీ టీచర్ ఈ నెల 19వ తేదీన మంచిర్యాల జిల్లా కాశీపేటలో కరోనా వ్యాక్సిన్ తీసుకొంది. వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత ఆమె అనారోగ్యానికి గురైందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  

వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత తీవ్రంగా జ్వరంతో ఆమె బాధపడింది.దీంతో ఆమెను చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు.  పది రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో  ఆమె చికిత్స పొందుతూ ఆదివారం నాడు  మరణించింది.

కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల హెల్త్ వర్కర్లు అనారోగ్యానికి గురయ్యారు. కొందరు మరణించారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న కారణంగానే హెల్త్ వర్కర్లు మరణించారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించలేదు.హెల్త్ వర్కర్ల మరణానికి గల కారణాలను వైద్య ఆరోగ్యశాఖాాధికారులు విచారిస్తున్నారు.ఈ మేరకు విచారణ కోసం ఆరా తీస్తున్నారు. 

click me!