వివేహత సంబంధం వల్ల ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కారుకులైనవారిని పోలీసులు అరెస్టు చేశారు.
వివేహతర సంబంధాలు ఎలాంటి దారుణాలకైనా ఒడిగట్టేలా చేస్తాయి. కొన్ని సార్లు ఎన్నో విధ్వంసాలకు దారి తీస్తాయి. కొన్ని సార్లు ప్రాణాలను కూడా తీస్తాయి. ఖమ్మం జిల్లాలో సరిగ్గా ఇలానే జరిగింది. ఓ మహిళ, యువకుడి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ యువకుడిని నుంచి ఆమె కొంత డబ్బు కూడా తీసుకునేది. అయితే కానీ కొన్ని రోజులకు అతడు ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో భర్తతో కలిసి అతడిని మట్టుపెట్టింది. ఈ విషయాన్ని పోలీసులు భయటపెట్టారు. భార్యాభర్తలపై కేసు నమోదు చేశారు.
పొలం పనుల వద్ద పరిచయం..
అతడో ట్రాక్టర్ డ్రైవర్. పేరు ఎల్లారావు (22). ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని తనికెళ్ల అనే గ్రామం అతడిది. రోజూ కూలీలను తన ట్రాక్టర్‌లో తీసుకువచ్చి రైతుల పొలాల వద్ద దించేయడం అతడి పని. ఈ క్రమంలో బానోత్ శివపార్వతి అనే వివాహితతో రాజుకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పుడప్పుడూ ఆమె ఇంటికి వెళ్తూ ఉండేవాడు. దాని కోసం ఆమె అతడి నుంచి డబ్బులు కూడా తీసుకునేది. ఈ విషయం భర్త రామారావుకు తెలిసింది. తనే మారుతుందని చెప్పి మందలించి వదిలేశాడు. అయితే కొంత కాలం తరువాత ఎల్లారావు తాగుడికి బానిస అయ్యాడు. ఆ మహిళను వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమెకు అతడి ప్రవర్తన నచ్చలేదు. ఎలాగైనా ఆ యువకుడిని బాధ ఉండకూడదని నిర్ణయించుంకుంది. భర్తతో కలిసి అతడిని హత్య చేయాలని భావించింది. ఈ విషయం తెలియని ఆ యువకుడు ఎప్పటిలాగే సదరు మహిళ ఇంటికి వెళ్లాడు. తలుపు కొట్టాడు. దీంతో ఆ మహిళ వెళ్లి తలుపు తీసింది. లోపలికి రాగానే పథకం ప్రకారం ముందే రెడీగా ఉంచుకున్న రోకలి బండతో ఎల్లారావుపై దాడి చేసింది. మెడపై, తలపై కొట్టింది. దీంతో ఆ యువకుడు కిందిపడిపోయాడు. దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆ భార్య భర్తలు పథకం వేసుకున్నారు. అందులో భాగంగానే తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఆ యువకుడి మృతదేహాన్ని ఆటోలో వేసుకొని బయటకు బయల్దేరాడు. అంగన్ వాడీ దగ్గర్లోని పొదల వద్ద మృతదేహాన్ని పారేశాడు. తాగిపడిపోయి ఉంటాడని అందరూ అనుకుంటారని వారు భావించారు. ఉదయం స్థానికులు ఈ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఏసీపీ స్నేహమెహ్రా, సీఐ వసంత్ కుమార్, ఎస్ఐ రాజు అక్కడికి చేరుకున్నారు. వెంటనే దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఎల్లారావు మృతదేహం తలపై గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి శివపార్వతి, రామారావును అదుపులోకి తీసుకున్నారు. తాము అతడిని హత్య చేసినట్టు ఆ దంపతులు సోమవారం పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నారు. ఆ యువకుడిని హత్య చేసేందుకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.