ఇంటర్మీడియట్ లో ఫెయిల్ కావడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనంపై మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు.
వరుస ఘటనలతో గుండె తరుక్కుపోతోందని హరీష్ రావు అన్నారు.
హైదరాబాద్: ఇంటర్మీడియట్ లో ఫెయిల్ కావడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనంపై మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. వరుస ఘటనలతో గుండె తరుక్కుపోతోందని హరీష్ రావు అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. బాధతో తల్లిదండ్రులకు, టీచర్లకు ఆయన కొన్ని సలహాలు, సూచనలు చేశారు.
కొన్ని రోజులుగా పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతోందని, పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు కాదు. ప్రాణాలు పోతే తిరిగిరావని ఆయన అన్నారు.
"దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. పసిపిల్లలను ఒత్తిడికి గురిచేసే చర్యలకు పాల్పడవద్దని తల్లిదండ్రుల్ని, టీచర్లను కోరుతున్నా. మన కనుపాపలైన బిడ్డల్ని కాపాడుకుందాం" అని హరీశ్ రావు అన్నారు.