కవిత అరెస్టు అందుకే.. : హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

Published : Mar 26, 2024, 09:51 PM IST
కవిత అరెస్టు అందుకే.. : హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

సారాంశం

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తును నిరాకరించిందని, అందుకే కవితను ఈడీ అరెస్టు చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.  

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ తప్పుగా అరెస్టు చేసిందని అన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తును నిరాకరించినందునే కవిత అరెస్టు అయ్యారని ఆరోపించారు. ఒక వేళ బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఈ రోజు కవిత కస్టడీలో ఉండేవారు కాదని పేర్కొన్నారు.

సంగారెడ్డిలో మంగళవారం పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీతో బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోదని అన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఒక సెక్యులర్ పార్టీ అని, గులాబీ పార్టీ ఎప్పటికీ సెక్యులర్‌గానే ఉంటారని వివరించారు.

దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తున్నారని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు ఈ కోణంలోనే జరిగిందని హరీశ్ రావు అన్నారు. అదే.. కేంద్ర ప్రభుత్వం వారికి మద్దతుగా నిలిచినవారిని కాపాడుకుంటున్నదని, వ్యతిరేకించినవారిని జైలుకు పంపిస్తున్నారని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్