ఆ మంత్రి నా కాళ్లు మొక్కలేదు... హరీష్ రావు

Published : Jul 10, 2019, 11:20 AM IST
ఆ మంత్రి నా కాళ్లు మొక్కలేదు... హరీష్ రావు

సారాంశం

తనపై వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంత్రి ఇద్రకరణ్ రెడ్డి తన కాళ్లు మొక్కలేదని.. కేవలం తాను సాయం చేశానని వివరణ ఇచ్చారు. 

తనపై వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంత్రి ఇద్రకరణ్ రెడ్డి తన కాళ్లు మొక్కలేదని.. కేవలం తాను సాయం చేశానని వివరణ ఇచ్చారు. ఇంతకీ మ్యాటరేంటంటే... బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు కాళ్లు మొక్కేందుకు సిద్దమయ్యారని ఓ వార్త ప్రతిక కథనాన్ని ప్రచురించింది. అయితే ట్విటర్‌లో దానిపై స్పందించిన హరీశ్‌రావు.. అందులో నిజం లేదని పేర్కొన్నారు. 

ఇంద్రకరణ్‌రెడ్డి నేల మీద నుంచి లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తుంటే తాను సాయపడినట్టు తెలిపారు. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రచురించారని అన్నారు. ఈ వార్తను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు. ఇది బాధకరమని.. భవిష్యత్‌లో ఇలాంటి వార్తలు ప్రచురించేముందు నిర్ధారణ చేసుకుని ప్రచురించాలని కోరారు

PREV
click me!

Recommended Stories

Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu