Harish Rao: పుత్రోత్సాహంలో మంత్రి హరీష్ రావు.. తనయుడి స్నాతకోత్సవంలో మంత్రి నయా లుక్..

Published : May 13, 2023, 06:57 AM IST
Harish Rao: పుత్రోత్సాహంలో మంత్రి హరీష్ రావు.. తనయుడి స్నాతకోత్సవంలో మంత్రి నయా లుక్..

సారాంశం

Harish Rao: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. మంత్రి తనయుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్ల వైరల్ అవుతున్నాయి.

Harish Rao:తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. మంత్రి హరీశ్ రావు కుమారుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందాడు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవంలో మంత్రి తనయుడు అర్చిష్మాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డ్ కూడా అందుకున్నాడు. కాక, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మంత్రి హరీశ్ రావు  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. "మా అబ్బాయి అర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉండగలను?.. ఇది అతని పట్టుదలకు, ఆకాంక్షకు నిదర్శనం. తన నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు.. అచ్చూ.. ఈ అద్భుతమైన మైలురాయిని అధిగమించిన  సందర్భంగా నీకు ప్రత్యేక అభినందనలు" అంటూ తన తనయుడిని ఉద్దేశించి క్యాప్షన్ రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు చేసిన ట్వీట్, ఫోటోలు సోషల్ మీడిమాలో వైరల్ గా మారింది. మంత్రి తనయుడు అర్చిష్మాన్ ను శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కామెంట్స్, రీ ట్వీట్ చేస్తున్నారు. అయితే.. ఎప్పుడూ వైయిట్ అండ్ వైయిట్ లో కనిపించే మంత్రి హరీష్..  షూట్, బూటు వేసే సరికి మంత్రి హరీష్ రావు లుక్ మారింది. నయా లుక్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?