తెలుగుభాషకు ప్రాధాన్యత ఇచ్చిన హరికృష్ణ

By rajesh yFirst Published Aug 29, 2018, 12:10 PM IST
Highlights

మాజీ ఎంపీ సినీనటుడు నందమూరి హరికృష్ణకు తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం. సినీ ఫంక్షన్లలోనైనా, వేడుకల్లోనైనా బంధువులతో స్నేహితులతో తెలుగులోనే మాట్లాడాలని ప్రయత్నించేవారు. తెలుగులోనే మాట్లాడాలని సూచించేవారు. చివరికి 2013లో రాష్ట్ర విభజన సమయంలో రాజ్య సభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుబడ్డారు హరికృష్ణ. తెలుగులోనే మాట్లాడతానని రాజ్యసభ చైర్మన్ తో గొడవకు సైతం దిగారు. తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో తాను మాట్లాడటం దురదృష్ఖకరమన్నారు. 
 

హైదరాబాద్: నందమూరి హరికృష్ణకు తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం. సినీ ఫంక్షన్లలోనైనా, వేడుకల్లోనైనా బంధువులతో స్నేహితులతో తెలుగులోనే మాట్లాడాలని ప్రయత్నించేవారు. తెలుగులోనే మాట్లాడాలని సూచించేవారు. చివరికి 2013లో రాష్ట్ర విభజన సమయంలో రాజ్య సభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుబడ్డారు హరికృష్ణ. తెలుగులోనే మాట్లాడతానని రాజ్యసభ చైర్మన్ తో గొడవకు సైతం దిగారు. తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో తాను మాట్లాడటం దురదృష్ఖకరమన్నారు. 

రాష్ట్ర విభజనను నిరసిస్తూ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వ్యక్తి హరికృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్‌లాగే తెలుగు భాషను, తెలుగువారిని అమితంగా ఇష్టపడే హరికృష్ణ, తెలుగు రాష్ట్రం కోసమే తన ఎంపీ పదవికి రాజీనామా చేయ్యడంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. తెలుగు భాషకోసం పరితపించిన హరికృష్ణ తెలుగు భాషా దినోత్సవం రోజునే తుది శ్వాస విడిచారు. 

మరోవైపు హరికృష్ణ జ్ఞాపకాలు మరవలేనివని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతిచెందడం పట్ల టీడీపీపీ సంతాపం వ్యక్తం చేసింది. రాజ్యసభలో తెలుగులో మాట్లాడే అవకాశం కోసం పోరాడారన్నారు.  
 

click me!