భాగ్య నగరంలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర.. ప్రత్యేక ఆకర్షణగా మహిళల బైక్ ర్యాలీ

Published : Apr 16, 2022, 02:21 PM ISTUpdated : Apr 16, 2022, 02:27 PM IST
భాగ్య నగరంలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర.. ప్రత్యేక ఆకర్షణగా మహిళల బైక్ ర్యాలీ

సారాంశం

హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని గౌలీగూడ రామమందిరం నుంచి తాడ్‌బన్ వరకు హనుమాన్‌ శోభాయాత్ర సాగనుంది. దాదాపు 21 కి.మీ మేర శోభయాత్ర సాగనుంది. 

హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని గౌలీగూడ రామమందిరం నుంచి తాడ్‌బన్ వరకు హనుమాన్‌ శోభాయాత్ర సాగనుంది. దాదాపు 21 కి.మీ మేర శోభయాత్ర సాగనుంది. మరోవైపు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని  కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి హునమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ శోభాయాత్ర కోఠిలోని డీఎం అండ్ హెచ్‌ఎస్ జంక్షన్ వద్ద ప్రధాన శోభాయాత్ర(వీరహనుమాన్ విజయాత్ర)లో చేరుతుంది. హనుమాన్ శోభాయాత్రలో భక్తులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. శోభాయాత్ర సాగుతున్న మార్గం జనంతో కిక్కిరిసి పోయాయి. ఇక, శోభాయాత్ర ప్రారంభానికి ముందు గౌలిగూడలోని రామ మందిరంలో హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కరోనా ప్రభావంతో రెండేళ్లు భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర జరగలేదు. ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గడంతో హనుమాన్ శోభాయాత్రను భక్తులు, హిందూ సంస్థలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ సిటీ, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు  చేశారు. 8 వేల మంది పోలీసులు, 550 సీసీ కెమెరాలు, 4 మౌంటెడ్ కెమెరాలు, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టారు. ఇక, శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నగరంలో మద్యం అమ్మకాలను పోలీసులు నిషేధం విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొన్ని ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

ప్రత్యేక ఆకర్షణగా మహిళల బైక్ ర్యాలీ.. 
హనుమాన్ శోభాయాత్రలో మహిళల బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో మహిళలు.. 200 బైక్‌లతో భారీ ర్యాలీ చేపట్టారు. తలపై పగిడి(తలపాగా) ధరించి బైక్‌లపై.. శోభాయాత్రతో పాటు ముందుకు సాగుతున్నారు. 

ఇక, ముందు టాస్క్‌ ఫోర్స్ టీమ్ వెళ్తుండగా.. వారి వెనకాలే విజయ శోభాయాత్ర కొనసాగుతుంది. యాత్ర సాగుతున్న మార్గంలో వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. యాత్ర ముందుకు కదిలాక.. ఆ మార్గంలో వాహనాలను అనుమతిస్తున్నారు. ఇక, హనుమాన్ శోభాయాత్ర రాత్రి రాత్రి 8 గంటల సమయంలో సికింద్రాబాద్‌లో తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ముగియనుంది. 

శోభాయాత్ర రూట్ ఇదే..
గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర.. పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్, కోఠి, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్, రామ్ కోఠి ఎక్స్ రోడ్, కాచిగూడ్ ఎక్స్ రోడ్, చిక్కడిపల్లి,  ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ న‌గ‌ర్ ఎక్స్ రోడ్, గాంధీ న‌గ‌ర్, క‌వాడిగూడ‌, ఆర్పీ రోడ్, ప్యార‌డైస్ మీదుగా కొన‌సాగ‌నుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్