టెన్త్ క్లాస్ హిందీపేపర్ లీక్:బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

By narsimha lode  |  First Published Apr 27, 2023, 3:25 PM IST

బీజేపీ తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్  రద్దు పిటిషన్ ను  హన్మకొండ  కోర్టు  డిస్మిస్  చేసింది


హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షు బండి సంజయ్  బెయిల్ రద్దు పిటిషన్ ను  గురువారంనాడు  హన్మకొండ  కోర్టు  డిస్మిస్  చేసింది. బండి  సంజయ్ కు  మంజూరు చేసిన బెయిల్ ను రద్దు  చేయాలని కోరుతూ  ఈ నెల  17న హన్మకొండ  కోర్టులో  పబ్లిక్ ప్రాసిక్యూటర్  పిటిషన్ దాఖలు  చేశారు. బెయిల్ మంజూరు  చేసిన సమయంలో  చేసిన సూచనలను  బండి సంజయ్ ఉల్లంఘించారని  పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.  

విచారణకు  కూడా  సహకరించడం లేదని  పబ్లిక్  ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు   షరతులను కూడా ఉల్లంఘిస్తున్నారని  కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  అయితే  పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను  బండి సంజయ్  తరపు  న్యాయవాదులు తోసిపుచ్చారు. టెన్త్ పేపర్ లీక్ స్కాం కేసులో రాజకీయ కక్షతోనే బండి సంజయ్ ను నేరస్తుడిగా చూపించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని  బండి సంజయ్ తరపు న్యాయవాదులు వాదించారు. అంతేకాదు  బెయిల్  సందర్భంగా    ఇచ్చిన  సూచనలను పాటిస్తున్నామని  కూడా  న్యాయవాదులు  చెప్పారు.  

Latest Videos

 టెన్త్ పేపర్ లీకేజీ స్కాంతో బండి సంజయ్ కు సంబంధం ఉన్నట్లు నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారని  న్యాయవాదులు  వాదించారు. విచారణకు సహకరించాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులో మొబైల్ ను స్వాధీనం చేయాలని కోరడంపట్ల బండి సంజయ్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  బండి సంజయ్ ఫోన్ పోయిందని పోలీసులకు  ఫిర్యాదు  చేసిన విషయాన్ని కూడా  న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.    ఈ విషయమై     గురువారంనాడు  వాదనలు  జరిగాయి.  ఈ వాదనలు  విన్న తర్వాత బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ ను కోర్టు డిస్మిస్  చేసింది. 

also read:బండి సంజయ్ కు బెయిల్: కరీంనగర్ జైలు నుండి విడుదల

ఈ నెల  4వ తేదీన  టెన్త్ క్లాస్ హిందీ పేపర్  లీకౌైందని  సోషల్ మీడియాలో  పోస్టులు వైరల్ గా మారాయి. ఈ విషయమై విచారణ  నిర్వహించిన  వరంగల్ పోలీసులు  దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. బండి సంజయ్ ఈ కేసులో ఏ1 నిందితుడని  వరంగల్ సీపీ  రంగనాథ్  ప్రకటించారు.  ఈ కేసులో  బండి సంజయ్ ను  పోలీసులు అరెస్ట్  చేశారు అయితే  ఈకేసులో  బండి సంజయ్ కు  ఈ నెల  6వ తేదీన హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరుచేసింది.ఈ నెల  7వ తేదీన  కరీంనగర్ జైలు నుండి బండి సంజయ్ వడుదలయ్యారు.   అయితే బండి సంజయ్ కు బెయిల్ ను రద్దు  చేయాలని  పోలీసుల తరపున  పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును ఆశ్రయించారు.  ఈ  పిటిషన్ పై ఇవాళ  హన్మకొండ కోర్టు  తీర్పును వెల్లడించింది.   
 

click me!