హైద్రాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు టెండర్ నోటిఫికేషన్: బిడ్డింగ్ దాఖలుకు జూలై 5 చివరి తేదీ

By narsimha lode  |  First Published May 16, 2023, 3:21 PM IST

హైద్రాబాద్  ఎయిర్ పోర్టు మెట్రోకు  హెచ్ఏఎంఎల్  టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.  జూలై 5వ తేదీ వరకు  బిడ్డింగ్ దాఖలుకు  చివరి తేది.  


హైదరాబాద్: హైద్రాబాద్ ఎయిర్ పోర్టు  మెట్రో టెండర్లకు  మంగళవారంనాడు హెచ్ఏఎంఎల్  నోటిఫికేషన్ జారీ చేసింది.  రేపటి నుండి బిడ్డింగ్  పత్రాలను  జారీ చేయనుంది  హెచ్ఏఎంఎల్. హైద్రాబాద్ ఎయిర్ పోర్టు  మెట్రో నిర్మాణ పనులకు  హైద్రాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్   నోటిఫికేషన్ జారీ చేసింది. ఎయిర్ పోర్టు మెట్రో బిడ్డింగ్ కు  చివరి తేదీ  జూలై 5 గా  నిర్ణయించారు. 

హైద్రాబాద్  మెట్రో కాంట్రాక్టు  విలువ రూ. 5,648 కోట్లుగా   హెచ్ఎఎంఎల్ నిర్ధారించింది.2022  డిసెంబర్  9వ తేదీన  హైద్రాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో నిర్మాణ పనులకు  తెలంగాణ సీఎం కేసీఆర్  శంకుస్థాపన  చేశారు.

Latest Videos

undefined

రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు  31 కి.మీ.రైల్వే లైనును ఏర్పాటు  చేయనున్నారు. ఈ మార్గం  పూర్తైతే  31 నిమిషాల్లోనే  శంషాబాద్  ఎయిర్ పోర్టు  నుండి రాయదుర్గం వరకు  చేరుకోవచ్చు. రెండున్నర కిలోమీటర్లు  భూగర్భంలో రైల్వే లైన్ ను  నిర్మించనున్నారు.హైద్రాబాద్  మెట్రో ను  శంషాబాద్  ఎయిర్ పోర్టుతో   లింక్, అభివృద్ది  చేసే పనులను  హెచ్ఏఎంఎల్  పర్యవేక్షిస్తుంది. 

మూడేళ్లలో  హైద్రాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రైలు పనులను  పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ తలపెట్టింది.  రాష్ట్ర ప్రభుత్వమే  ఈ పనులను  చేపట్టింది.
 హైద్రాబాద్ మెట్రో తొలి దశలో  ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో    పనులు చేపట్టారు. అయితే  రెండో దశలో మాత్రం రాయదుర్గం- శంషాబాద్   వరకు  చేపట్టే  పనులను  రాష్ట్ర ప్రభుత్వం  భరించనుంది. ఈ మేరకు  తెలంగాణ ప్రభుత్వం  స్పెషల్ పర్సస్ వెహికల్ హైద్రాబాద్  ఎయిర్ పోర్టు  మెట్రో లిమిటెడ్ ను  ఏర్పాటు  చేసింది. 

click me!