విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్న కేసీఆర్: బండి సంజయ్

By narsimha lode  |  First Published May 16, 2023, 2:28 PM IST

హైద్రాబాద్ దిల్ సుఖ్ నగర్ లో  ఏబీవీపి నాయకురాలు  ఝాన్సీని   బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ  పరామర్శించారు. 


హైదరాబాద్: విద్యార్ధి సమస్యలపై  పోరాటం  చేస్తున్న ఏబీవీపీ నాయకులను  కేసీఆర్ సర్కార్ వేధింపులకు  గురి చేస్తుందని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఆరోపించారు.

హైద్రాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని  ఏబీవీపీ నాయకురాలు  ఝాన్సీని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ మంగళవారంనాడు పరామర్శించారు.   ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడారు.     కేసీఆర్ సర్కార్ అన్ని  వర్గాలతో ఆటలాడుతుందన్నారు. కౌన్సిలింగ్ లేకుండానే  ఇంజనీరింగ్  ఆడ్మిషన్ల దందా చేస్తారా అని  ఆయన  ప్రశ్నించారు.

Latest Videos

ప్రైవేట్  యూనివర్శిటీ హోదా రాకుండానే  గురునానక్, శ్రీనిధి కాలేజీల్లో  ఆడ్మిషన్లు  ఎలా ఇస్తారని  బండి సంజయ్ అడిగారు.  ఈ రెండు కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులకు  న్యాయం చేయాలని  కోరుతూ   ఉన్నత విద్యామండలి ముందు  ఏబీవీపీ నేతలు  ధర్నా చేసిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.  ఉన్నత విద్యామండలి ముందు ధర్నా చేస్తే తప్పేంటని  ఆయన  ప్రశ్నించారు.   ఉన్నత విద్యామండలి ముందు  ధర్నా చేసిన  ఏబీవీపీ నాయకురాలు  ఝాన్సీపై పోలీసులు థర్డ్  డిగ్రీ ప్రయోగించారని  బండి సంజయ్  చెప్పారు. ప్రశ్నిస్తున్నవారిపై  కేసీఆర్ సర్కార్  కేసులు పెడుతూ  వేధింపులకు గురి చేస్తుందని  ఆయన  ఆరోపించారు. దళితులను దూషించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై  చర్యలు తీసుకోవాలని  ఆయన  డిమాండ్  చేశారు.  అంబేద్కర్ రాసిన  రాజ్యాంగం వల్లే  శ్రీనివాస్ గౌడ్  కు  మంత్రి పదవి దక్కిందన్నారు. 

click me!