హైదరాబాద్ లో హలీమ్, పలావ్ ఈటీంగ్ పోటీలు

By telugu teamFirst Published May 21, 2019, 11:22 AM IST
Highlights

రంజాన్ మాసం మొదలైందంటే చాలు... ఎక్కడ చూసినా హలీం, బిర్యానీల వాసనలు గుమగుమలాడిపోతుంటాయి. హిందూ, ముస్లిం తేడా లేకుండా జనాలు ఎగబడి లాగించేస్తూ ఉంటారు.


రంజాన్ మాసం మొదలైందంటే చాలు... ఎక్కడ చూసినా హలీం, బిర్యానీల వాసనలు గుమగుమలాడిపోతుంటాయి. హిందూ, ముస్లిం తేడా లేకుండా జనాలు ఎగబడి లాగించేస్తూ ఉంటారు. అయితే... ఈ హలీంను ఎవరు ఎక్కువ తింటే... వారే విజేతలంటూ ఈటీంగ్ పోటీలు పెట్టారు.

జూబ్లీహిల్స్‌లోని సోడాబాటిల్‌ ఓపెనర్‌ వాలా రెస్టరెంట్‌లో సోమవారం హలీమ్‌ – పలావ్‌ ఈటింగ్‌ పోటీలు నిర్వహించారు. ప్రత్యేక రంజాన్‌ మెనూతో ఏర్పాటు చేసిన ఈటింగ్‌ పోటీల్లో పెద్దసంఖ్యలో ఆశావాహులు పాల్గొన్నారు. 1.2 కేజీల హలీమ్‌ లాగించి భరత్‌ విజేతగా నిలవగా బాసిత్‌ అలీ రన్నరప్‌గా నిలిచాడు.

2.5 కేజీల పలావ్‌ ఆరగించి సౌమ్య ప్రకాష్‌ విజేతగా నిలవగా 1.5 కేజీల పలావ్‌ తిని అమిత్‌నాయర్‌ రన్నరప్‌గా నిలిచాడు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. గత రెండేళ్ల నుంచి ఈటింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు సోడాబాటిల్‌ ఓపెనర్‌ వాలా రెస్టరెంట్‌ నిర్వాహకులు తెలిపారు.

click me!