రూపాయికే అంత్యక్రియలు: కరీంనగర్ మేయర్ కొత్త పథకం

By Siva KodatiFirst Published May 21, 2019, 10:15 AM IST
Highlights

వినూత్న పథకాలతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న కరీంనగర్ నగర మేయర్ రవీందర్ సింగ్ మరో పథకానికి తెర దీశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు భారం కలగకుండా నగర పాలక సంస్థ ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. 

ఇందు కోసం నిధులు కేటాయించడంతో పాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ప్రకటించారు. కరీంనగర్‌లో సోమవారం రవీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ...‘‘అంతిమ యాత్ర.. ఆఖరి యాత్ర’’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.

పేదలకు భారం కలగకుండా నగరంలో ఎవరు చనిపోయినా రూపాయి చెల్లిస్తే చాలు వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు దహన సంస్కారాలు చేపడతామని రవీందర్ తెలిపారు.

ఇందుకోసం దాతల సాయంతో పాటు నగరపాలక సంస్ధ ద్వారా రూ.1.10 కోట్లు కేటాయించామని... రూ. 50 లక్షలతో వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపామని వెల్లడించారు.

దాతల కోసం ప్రత్యేకంగా నగర పాలక కమిషనర్ పేరు మీద ఖాతా ఏర్పాటు చేస్తామని... చనిపోయిన వారి కుటుంబానికి 50 మందికి సరిపడా భోజనం రూ.5కే అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రవీందర్ తెలిపారు. అంతకు ముందు ఒక రూపాయికే నల్లా కనెక్షన్ ప్రకటించి మేయర్ సంచలనం సృష్టించారు. 

click me!