పోలీసులకు చుక్కలు చూపిస్తున్న హాజీపూర్ సీరియల్ కిల్లర్

Siva Kodati |  
Published : May 11, 2019, 05:12 PM IST
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న హాజీపూర్ సీరియల్ కిల్లర్

సారాంశం

హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి విచారణలో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఎంతగా ప్రశ్నిస్తున్నప్పటికీ విచారణకు అతను సహకరించడం లేదు, పోలీసులు ముందు శ్రీనివాస్ రెడ్డి నోరు విప్పడం లేదని సమాచారం. 

పోలీసులు ప్రశ్నలకు మౌనమే సమాధానంగా అతను వ్యవహరిస్తున్నాడు. అతని ప్రవర్తన కారణంగా సిట్ విచారణ ముందుకు సాగకపోవడంతో విచారణాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో చిన్నారులను చంపి పాతిపెట్టిన బావి దగ్గర  క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితుని తల్లి, సోదరుడు, స్నేహితులను పోలీసులు విచారించారు.

దీనితో పాటు శ్రీనివాస్ రెడ్డి ఫోన్‌లోని సమాచారంతో పాటు కాల్ డేటాను సిట్ అధికారులు విశ్లేషిస్తున్నారు. గ్రామస్తులు దాడి చేసే అవకాశం ఉండటంతో రాత్రి సమయంలో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ను పోలీసులు పూర్తి చేశారు. ఈ నెల 13 వరకు శ్రీనివాస్ రెడ్డిని సిట్ విచారించనుంది. 

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు