రూ.700 కోసం ఆటోడ్రైవర్ హత్య: నిందితుల పట్టివేత

Siva Kodati |  
Published : May 11, 2019, 04:08 PM ISTUpdated : May 11, 2019, 04:19 PM IST
రూ.700 కోసం ఆటోడ్రైవర్ హత్య: నిందితుల పట్టివేత

సారాంశం

హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో దారుణం జరిగింది. ఆటోడ్రైవర్‌ను పోకిరీలు కిరాతకంగా హత్య చేశారు. ఆటో కిరాయి ఇవ్వమన్నందుకు ఆగ్రహించిన ఆరుగురు వ్యక్తులు ఆటోడ్రైవర్‌ను చంపి, శవాన్ని ఆటోతో పాటు కాల్చేసి పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో దారుణం జరిగింది. ఆటోడ్రైవర్‌ను పోకిరీలు కిరాతకంగా హత్య చేశారు. ఆటో కిరాయి ఇవ్వమన్నందుకు ఆగ్రహించిన ఆరుగురు వ్యక్తులు ఆటోడ్రైవర్‌ను చంపి, శవాన్ని ఆటోతో పాటు కాల్చేసి పారిపోయారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత నెల 30వ తేదీన పోలీసులు ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. చాంద్రాయణగుట్టకు చెందిన ఓ మహిళ తన భర్త నాలుగు రోజులుగా ఇంటికి రావడం లేదని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా మృతుని పేరును సాయినాథ్‌గా గుర్తించిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అసలు నిజాలను బయటపెట్టారు.

పాతబస్తీకి చెందిన అరుగురు యువకులు సాయినాథ్‌ను.. పహాడీ షరీఫ్ వరకు ఆటోను మాట్లాడుకుని వెళ్లారు. గమ్య స్థానానికి చేరిన తర్వాత రూ. 700 ఆటో కిరాయిని ఇవ్వాల్సిందిగా సాయినాధ్ వారిని అడగటంతో సదరు యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మమ్మల్నే డబ్బులు అడుగుతావా అంటూ అతనితో గొడవకు దిగారు. అనంతరం తమ వద్ద వున్న కత్తితో సాయినాథ్ గొంతు కోసి, అతని వద్ద వున్న డబ్బులు లాక్కొని శవాన్ని ఆటోలోనే వేసి కాల్చివేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

నిందితులను ఇస్మాయిల్, అమీర్, ఆలీంఖాన్, మహ్మద్ అబ్ధుల్ మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు సాయినాథ్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!