ఇంట్లోకి తొంగిచూస్తూ వివాహితకు సైగలు: ఆకతాయిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి

Published : Aug 29, 2019, 05:59 PM IST
ఇంట్లోకి తొంగిచూస్తూ వివాహితకు సైగలు: ఆకతాయిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి

సారాంశం

 శ్రీశైలం అనే పొకిరి యువతులు, మహిళల పట్ల వెకిలి చేష్టలు చేసేవాడు. ఈ క్రమంలో ఓ వివాహితను వేధించడం మొదలుపెట్టాడు.. వెకిలి చూపులతో అసభ్యకర సైగలకు పాల్పడుతూ ఆమెను వేధింపులకు గురిచేసేవాడు.  శ్రీశైలం రాకను పసిగట్టిన వివాహిత భర్త ఇంటి దగ్గరకు రాగానే అతనిని పట్టుకున్నారు. అనంతరం పోకిరిని చెట్టుకు కట్టేసి స్థానికులతో కలిసి చితకబాదారు

ఓ వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయిని స్థానికులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండలోని అర్జాల బావిలో శ్రీశైలం అనే పొకిరి యువతులు, మహిళల పట్ల వెకిలి చేష్టలు చేసేవాడు.

ఈ క్రమంలో ఓ వివాహితను వేధించడం మొదలుపెట్టాడు.. వెకిలి చూపులతో అసభ్యకర సైగలకు పాల్పడుతూ ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. వివాహిత ఇంటి పరిసరాల్లో సంచరిస్తూ ఇంట్లోకి తొంగి చూసేవాడు.

ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. ఈ క్రమంలో గురువారం సీసీ కెమెరాల ద్వారా శ్రీశైలం రాకను పసిగట్టిన వివాహిత భర్త ఇంటి దగ్గరకు రాగానే అతనిని పట్టుకున్నారు. అనంతరం పోకిరిని చెట్టుకు కట్టేసి స్థానికులతో కలిసి చితకబాదారు. పోలీసులకు సమాచారం అందించి శ్రీశైలంను అప్పగించారు. 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్