ప్రేమ పెళ్లి... ఒక్కటైన రెండు రోజులకే...

Published : May 11, 2019, 07:30 AM IST
ప్రేమ పెళ్లి... ఒక్కటైన రెండు రోజులకే...

సారాంశం

ఒకరిని మరొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెద్దల ఆశీస్సులతో ఒక్కటయ్యారు. ఇక జీవితంలో తమ ఎలాంటి అవరోధాలు లేవు అని సంబరపడిపోయేలోగా.... విధి వక్రించింది. 

ఒకరిని మరొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెద్దల ఆశీస్సులతో ఒక్కటయ్యారు. ఇక జీవితంలో తమ ఎలాంటి అవరోధాలు లేవు అని సంబరపడిపోయేలోగా.... విధి వక్రించింది. పెళ్లి జరిగిన రెండు రోజులకే నవ వరుడు శవమయ్యాడు. రైలు ప్రమాదంలో వరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. 

దేవునిపల్లికి చెందిన కిశోర్‌(25)కు రెండు రోజుల క్రితం వివాహం అయింది. భార్యకు అనారోగ్య సమస్య తలెత్తడంతో మందుల కోసం బయటకొచ్చాడు. అదే ధ్యాసలో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో.. కాచిగూడ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న డెమో ప్యాసింజర్‌ వేగంగా ఢీ కొట్టింది. దీంతో.. కిశోర్ అక్కడికక్కడే కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి జరిగిన ఇంట వెంటనే విషాదం చోటుచేసుకోవడం గ్రామస్థులను సైతం కలచివేసింది. వారి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది