వేరుశెనగలతో మహిళలకు టోపీ.. నిందితుడు అరెస్ట్

By ramya neerukondaFirst Published 24, Jan 2019, 4:35 PM IST
Highlights

వేరుశెనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తానని నమ్మించి వేలాది మంది మహిళల నుంచి ఓ వ్యక్తి  కోట్ల రూపాయలు నొక్కేసాడు. 


వేరుశెనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తానని నమ్మించి వేలాది మంది మహిళల నుంచి ఓ వ్యక్తి  కోట్ల రూపాయలు నొక్కేసాడు. చివరకు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రీన్ గోల్డ్ బయోటిక్ సంస్థ ఎండీ శ్రీకాంత్ ని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. రూ.లక్ష చెల్లిస్తే.. వేరుశెనగల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తానంటూ మహిళలను నమ్మించాడు. నెలకు రూ.10వేలకు వరకు ఆదాయం వస్తుందని నమ్మించాడు. అతని మాటలు నమ్మి మహిళలు డబ్బులు చెల్లించారు. ప్రత్యేకంగా ఏజెంట్ల ద్వారా వాటికి ప్రచారం కల్పించి వేలాది మందిని మోసం చేశారు.

 తీరా డబ్బులు చెల్లించాక.. యంత్రాలు ఇవ్వకుండా బోర్డు తిప్పేశాడు. మోసపోయామని తెలుసుకున్న మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహార వెలుగులోకి వచ్చింది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల సంఖ్య దాదాపు 6వేల మంది ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. 

Last Updated 24, Jan 2019, 4:35 PM IST