గ్రేటర్ ఐడియా.. ఫోన్ చేస్తే ఇంటికే బస్ పాస్..!

Published : Jan 08, 2021, 11:33 AM IST
గ్రేటర్ ఐడియా.. ఫోన్ చేస్తే ఇంటికే బస్ పాస్..!

సారాంశం

ఐదుగురికి తగ్గకుండా పాస్ తీసుకోవాలన్న నిబంధన పెట్టినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సౌకర్యం కోసం అదనంగా ఒక్క రూపాయి చెల్లించాల్సిన పని లేదని చెప్పారు.

హైదరాబాద్ నగర ప్రజలకు గ్రేటర్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గతంలో బస్ పాస్ కోసం చాలా మంది గంటలతరపడి ఎదురు చూడాల్సి వచ్చేంది. ఈ క్రమంలో.. గ్రేటర్ ఆర్టీసీ సరికొత్త ఆఫర్ తీసుకువచ్చింది. ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటికే పంపిచే సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 80082 04216.. నంబరుకు ఫోను చేస్తే అపార్టుమెంట్‌, కాలనీ, మాల్‌, కార్యాలయం, కంపెనీ, పారిశ్రామిక వాడ ఇలా ఎక్కడున్నా.. మీకు అందించే బాధ్యత తమదని ఆర్టీసీ గ్రేటర్‌హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

అయితే ఐదుగురికి తగ్గకుండా పాస్ తీసుకోవాలన్న నిబంధన పెట్టినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సౌకర్యం కోసం అదనంగా ఒక్క రూపాయి చెల్లించాల్సిన పని లేదని చెప్పారు. అలాగే నగరంలో 31 బస్సు పాస్‌ కేంద్రాలను కూడా ప్రయాణికులకు అందుబాటులో వెల్లడించారు. ఈ కేంద్రాలు ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకూ పని చేస్తాయి.

బస్ పాస్ ధరలు..

ఆర్డినరీ - 950
మెట్రో ఎక్స్‌ప్రెస్ - 1070
మెట్రో డీలక్స్ - 1185
ఎయిర్‌పోర్ట్ పుష్పక్ - 2625
ఎన్‌జీవో ఆర్డినరీ - 320
ఎన్‌జీవో మెట్రో ఎక్స్‌ప్రెస్ - 450
ఎన్‌జీవో మెట్రో డీలక్స్ - 575

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?