ఆర్టీసి సమ్మె: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు చురకలు

By telugu teamFirst Published Oct 11, 2019, 1:12 PM IST
Highlights

ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము రోడ్లను చూస్తున్నామని, బస్సులు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.

హైదరాబాద్: ఆర్టీసి కార్మికుల సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ ఆర్టీసి చీఫ్ తమ ముందు ఉంచిన ప్రత్యామ్నాయాలు నిర్దిష్టంగా లేవని వ్యాఖ్యానించింది. 

బస్సులు లేని రోడ్లను చూస్తుంటే ప్రయాణికులు అనుభవిస్తున్న కష్టాలు అతి సాధారణంగా లేవని అర్థమవుతోందని వ్యాఖ్యానించింది.  తాము రోడ్లను చూస్తున్నామని, బస్సులు కనిపించడం లేదని జస్టిస్ ఎ రాజశేఖర రెడ్డి, జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డిలతో కూడిన హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. కొత్త సిబ్బంది, ఆర్టీసి కిరాయికి తీసుకున్న ప్రైవేట్ బస్సుల ఉద్యోగులు తమ బస్సు పాసులను తిరస్కరిస్తున్నారని తమకు విద్యార్థుల నుంచి వాట్సప్ సందేశాలు వస్తున్నాయని న్యాయమూర్తులు చెప్పారు. 

సమ్మె అక్రమమని ప్రకటించి, ఆర్టీసి కార్మికులను విధుల్లో చేరాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సుబేందర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింిద. 

రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాఖలు చేసిన నివేదిక అసంపూర్తిగా ఉందని ఆసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సవివరమైన నివేదిక సమర్పించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. కార్మికులు ఏకపక్షంగా సమ్మెకు దిగారనే ప్రభుత్వ వాదనను కార్మికుల తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. 

click me!