కారణమిదీ:పోలీస్ శాఖపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం

Published : Jul 30, 2023, 04:09 PM IST
కారణమిదీ:పోలీస్ శాఖపై  గోషామహల్  ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం

సారాంశం

తెలంగాణ పోలీస్ శాఖపై   గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్  అసహనం వ్యక్తం  చేశారు.  పాస్ పోర్టు వెరిఫికేషన్ ఇవ్వకుండా  జాప్యం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం  చేశారు.

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖపై  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  అసహనం వ్యక్తం చేశారు. పాస్ పోర్టు కోసం తాను  ధరఖాస్తు  చేసి  రెండు నెలలు దాటిని  ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్ చేయకపోవడంపై   రాజాసింగ్  పోలీస్ శాఖపై  ఆగ్రహం వ్యక్తం  చేశారు.    ప్రజా ప్రతినిధిగా ఉన్న తన పట్లే  పోలీస్ శాఖ ఈ రకంగా వ్యవహరిస్తే  ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన  ప్రశ్నించారు. 

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  ఈ ఏడాది మే   25న పాస్ పోర్టు కోసం ధరఖాస్తు  చేసుకున్నారు. అయితే  ఇంత వరకు  పాస్ పోర్టు వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి కాలేదని  రాజాసింగ్  పోలీస్ శాఖపై  అసహనం వ్యక్తం  చేశారు.ఈ విషయమై ట్విట్టర్ లో తన అసంతృప్తిని  వ్యక్తం చేశారు.  ఈ ట్వీట్ ను  తెలంగాణ డీజీపీ, హైద్రాబాద్ సీపీకి  రాజాసింగ్  ట్యాగ్ చేశారు.  విదేశాలకు వెళ్లేందుకు  గాను  రాజాసింగ్  పాస్ పోర్టు కోసం ధరఖాస్తు  చేశారని  సమాచారం. అయితే  ఇంతవరకు  పాస్ పోర్టు వెరిఫికేషన్ పూర్తి కాకపోవడంపై  రాజాసింగ్ పోలీస్ శాఖ తీరుపై మండిపడ్డారు.

 

గతంలో కూడ  పోలీసు శాఖపై  రాజాసింగ్ విమర్శలు చేశారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆయన  పోలీస్ శాఖ తీరును తప్పుబట్టారు.గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది.  గత ఏడాదిలో  మహ్మద్ ప్రవక్తపై  వ్యాఖ్యలు చేశారని  రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం  సస్పెన్షన్ వేటేసింది.  రాజాసింగ్ పై  సస్పెన్షన్ ఎత్తివేయాలని పలువురు బీజేపీ నేతలు కోరుతున్నారు.ఈ విషయమై బీజేపీ నాయకత్వం  ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది

PREV
click me!

Recommended Stories

Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?
Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా